హైదరాబాద్: ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్‌కు నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈమేరకు కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈనెల 21న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. వ్యక్తిగత హాజరునుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. గతంలో ఎంపీ ఎంఏ న్‌కు చెందిన సంతకాన్ని ఫోర్జరీ చేసి డీజీపీ దినేష్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో కోర్టుకు హాజరుకావాలని ఉమేష్‌ను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.