హైదరాబాద్ : మంత్రి పార్థసారథితో ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఉపాధ్యాయుల బదిలీలను వాయిదా వేయడానికి సర్కార్ మొగ్గు చూపుతుండటంతో మంత్రితో వారు భేటీ అయ్యారు. మంత్రితో రెండు దఫాలుగా ఉపాధ్యాయులు చర్చలు జరిపినట్లు సమాచారం. బదిలీలను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.