హైదరాబాద్ : నేటి సాయంత్రంతో రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ నెల 12న రాష్ట్రంలోని 18 శాసనసభ స్థానాలకు, నెల్లూరు పార్లమెంట్ స్థానంకు పోలీంగ్ జరగనుంది. ఉప ఎన్నికల జరిగే ప్రంతాల్లో ఎలాంటి అవాంచనియ సంఘటనలు జరగలేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఉప ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లో పోలీంగ్ ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు జరిగే ప్రదేశాల్లో సోదాలు చేయాలని ఆదేశించారు.