7/12/2012 2:55:13 AM
నాన్చడం సరికాదు..
తెలంగాణను తేల్చండి
-
సోనియా, రాహుల్‌ను కోరిన ఎంపీ కావూరి
- సానుకూలంగా స్పందించిన మేడమ్
న్యూఢిల్లీ, జూలై 11( టీ మీడియా): రాష్ట్ర విభజనపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కోరినట్లు ఏలూరు ఏంపీ కావూరి సాంబశివరావు తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మేలు జరిగేపక్షంలో రాష్ట్రాన్ని విభజించమని మేడమ్‌కు స్పష్టపరిచినట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని నమ్మితే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం కుదరదని ప్రకటించాలని అధినేవూతిని కోరానన్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా తెలంగాణ అంశాన్ని నాన్చడం సరికాదన్న అభివూపాయాన్ని మేడమ్‌కు తెలిపినట్లు చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో ఆందోళనలు తప్పనందున ఏదో ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. విభజన సమస్య పరిష్కారానికి సోనియా కూడా సానుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాను మాట్లాడుతానన్నారు. అధినేత్రి సోనియాతో రెండు రోజుల క్రితం సమావేశమైన ఆయన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో బుధవారం భేటీ అయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు లాంటి అంశాలు తమ చర్చల్లో రాలేదని కావూరి పేర్కొన్నారు. నాయకత్వం మార్పువల్ల సమర్థత పెరగదన్నారు. అభివృద్ధి కార్యక్షికమాలు పెద్ద ఎత్తున చేపట్టినప్పటికి ఎన్నికల్లో అనేక పరిణామాల ప్రభావం ప్రజలపై ఉన్నందున తమకు ఓటమి తప్పలేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనమైతే కేంద్రంలో అధికారం చేపట్టడం కష్టమైందున రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాహుల్ గాంధీని కోరినట్లు తెలిపారు.
Other News