గోవాలో మట్కా దందాపై ఈసీ కొరడా

Tue,January 10, 2017 01:24 AM

పనాజీ, జనవరి 9:గోవాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మట్కా దందాపై కొరడాఝళిపించాలని పోలీసుశాఖను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికలపై ధన, కండ బల ప్రభావం పడకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నది. మట్కా నడిపే నిర్వాహకులపై కేసులు పెట్టాలని, జూదాన్ని నిలిపివేయాలని రెండు జిల్లాల పోలీసులను ఆదేశించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కునాల్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే పలువురు మట్కా నిర్వాహకులను అదుపులోకి తీసుకొని 26 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను తీసుకొంటామని అన్నారు.

బీజేపీ అభ్యర్థిపై ఆరెస్సెస్ రెబల్ పోటీ


గోవాలో అధికార బీజేపీకి ఆరెస్సెస్ రెబల్ సుభాష్ వేలింగ్‌కర్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. బీజేపీకి బలమైన పనాజీ నియోజకవర్గంలో వేలింగ్‌కర్ తన సహచరుడు సుకేర్కర్‌ను బరిలోకి దింపుతున్నారు. ఈ నియోజకవర్గానికి గతంలో రక్షణమంత్రి మనోహర్ ప్రాతినిధ్యం వహించారు.

195

More News

మరిన్ని వార్తలు...