|
|
Home >> >>Kavithalu
పల్లవి: సందమామా సందామామా ॥ సంద॥ చరణం: నింగిలోని జాబిలమ్మ-నేలదాకా చెయిజాపగ కాలమే నిన్నెత్తుకోని- జోలపాట పాడుతుండగ నిన్ను జూపె గోరుముద్దలు- ఓసందమామా వెన్నముద్దలని పెడితీ- నా సందమామా ॥ సంద॥ ఆడజన్మకు శాపమోపూ-నీలి మబ్బులు కమ్ముకోగా ఆకాశమంత సగము-అమాస చీకటవ్వగ పోరుజెండై ఎగిరేబిడ్డా- ఓ సందమామా హోరుగాలికి మబ్బులు తొలిగే- నా సందమామా ॥ సంద॥ ఊరునివూదల జోగుతుండగా-నేను బిడ్డయాదిలుంటె ఉట్టిమీద కూర అన్నము-తిన్నట్టుగ కలలు గంటి పిల్లి అడుగుల సప్పుడైనా- ఓ సందమామా నీ తల్లి మనసు జల్లుమానె-నా సందమామా ॥ సంద॥ అడవిగాసిన వెన్నెలయ్యి-అక్కడే నువు జూసినావా అరుగుదాక వచ్చిపోయి-పేరు జెప్పగ మర్చినావా నేలరాలిన బిడ్డపైనే-ఓ సందమామా నువు జాలికొంగు పర్సినావా-నా సందమామా ॥ సంద॥ కన్నబిడ్డను తెచ్చి ఇమ్మని- నిన్నడగలేను అరుణతారల వెల్గునేమో-పేరుపెట్టి పిలువలేను నీటిలోని కలువలన్ని- ఓ సందమామా వాకిట్లో పూసినాయి- నా సందమామా సందమామ సందామామా మల్లెజాజులు ముంగిట్లో- ఓ సందమామా తెల్లవారగ తెలుపే ఎరుపై రాలి రంగవల్లులాయె నా సందమామా -మిత్ర
Other Articles
|
|||||