కారుబాంబు దాడిలో 51 మంది మృతి

Fri,February 17, 2017 03:47 AM

iraq
బాగ్దాద్: దక్షిణ బాగ్దాద్‌లో గురువారం జరిగిన కారుబాంబు దాడిలో కనీసం 51 మంది దుర్మరణం చెందారు. షియాలను లక్ష్యంగా చేసుకొని తామే ఈ దాడికి పాల్పడ్డామని ఐఎస్‌తో సంబంధం ఉన్న అమక్ ఏజెన్సీ చెప్పుకొన్నది. సాయంత్రం 4.15 గంటలకు పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన అనంతరం అక్కడ వారి శరీరాలు ముక్కలుముక్కలుగా ఎగిరిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. బయ్యా మార్కెట్లో కారు డీలర్‌షిప్‌ల వద్ద ఒక ఉగ్రవాది కారుబాంబు దాడికి పాల్పడ్డాడని బాగ్దాద్ ఆపరేషన్ల కమాండ్ ప్రతినిధి పేర్కొన్నారు. కనీసం 60 మంది గాయపడి ఉండవచ్చని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అన్నారు.

977

More News

మరిన్ని వార్తలు...