Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> Zindagi >> Silsila


సూల్తాన్ ముత్యాల

sulthan1
జిందగీ బడీ హోనీ చాహియే... లంబీ నహీ! దీనికి గతించిన సాక్ష్యం జగ్లూరి ముత్యాలరావు!ఈయన జిందగీ బడీ హీ నహీ బల్కీ లంబీ భీ థీ!పొలిటీషియన్ సీరియస్‌గానే ఉండక్కర్లేదు...ఇతర అభిరుచుల మీద మనసు పెడుతూ జీవితంలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించొచ్చు అని తన లైఫ్‌ను ఎగ్జాంపుల్‌గా చూపించాడు ఈ నేత!తెలియకపోవడం తప్పుకాదు కానీ తెలియనిదాన్ని అడిగి తెలుసుకోక పోవడం తప్పు అనే ఫిలాసఫిని చివరిదాకా ఆచరించాడు ఈ సెల్ఫ్‌మేడ్ మ్యాన్!తన ఆహార్యం, ఆచారంతో నెహ్రూచేత సుల్తాన్ అని పిలిపించుకున్న ముత్యాలరావు సిల్‌సిలా ఇది....హైదరాబాద్...బేగంపేట్‌లో..పచ్చని చెట్ల మధ్య అందమైన ఓ ఇల్లు! పేరు నవరత్న!అదే ముత్యాలరావు ఇల్లు. దానికి ఆ పేరు పెట్టడానికి కారణం ఆయన సంతానమే! అయిదుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు..మొత్తం తొమ్మిది మంది పిల్లలు ఆయనకు. అందుకే తన నివాసానికి నవరత్న అని పెట్టుకున్నారు. ముత్యాలరావు పిల్లపూవరూ తన రాజకీయ వారసత్వాన్ని అందుకోలేదు. రాజకీయ వారసత్వం అప్పనంగా అందేది కాదు..ఆసక్తితో వాళ్లంతట వాళ్లు కష్టపడి నిరూపించుకునేది అనుకునేవారు. అందుకే ఎవరినీ రాజకీయరంగం వైపు ప్రోత్సహించలేదు. తాను చదివింది పదో తరగతి దాకే!(కానీ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలో అనర్ఘళంగా మాట్లాడేవారు) కాబట్టి చదువు విలువేంటో ఆయనకు తెలుసు. పిల్లల ఎడ్యుకేషన్ పిల్లర్‌ను స్ట్రాంగ్ చేశారు. తొమ్మిది మందినీ మంచి విద్యాసంస్థల్లోనే చదివించారు. ముత్యాల రావు రాజకీయాల్లో ఎంత సీరియస్‌గా ఉండేవారో ప్రైవేట్ లైఫ్‌లో అంత సరదాగా ఉండేవారు. ఆట, పాట ఆయనకు ప్రాణం. సితార్ వాద్య సంగీతాన్ని నేర్చుకున్నారు. ఢిల్లీ ఘరానాలో సభ్యులు కూడా! బిజీ రాజకీయాల నుంచి ఎప్పుడు తెరపి దొరికినా హైదరాబాద్‌లో వాలిపోయేవారు. ఆత్మీయులను పిలిచి పార్టీలు ఇచ్చేవారు. ఆడంబరంగా లేకపోయినా పర్‌ఫెక్ట్‌గా ఉండేది ఆ గెట్ టుగెదర్. గానాభజానా, ఆత్మీయ పలకరింపులతో ఆహ్లాదకరంగా సాగేది. అతిథులంతా ఇంకే పార్టీలపట్లయినా అనాసక్తంగా ఉండేవారు కానీ ముత్యాలరావు పార్టీ అంటే ఎన్ని పనులున్నా వదులుకుని మరీ వచ్చేవారట. నిజాంకాలంనాటి గజల్ సింగర్ విఠల్‌రావుకు ఆయన పార్టీలో ప్రముఖస్థానం ఉండేది. ముత్యాలరావు సితార్ వాయించడంలోనే కాదు వెస్ట్రన్ డాన్స్ చేయడంలోనూ ఫస్టే! సంగీత వారసత్వాన్ని మాత్రం ఆయన ఇద్దరు కొడుకులు పుణికి పుచ్చుకున్నారు. రెండో కొడుకు బాబురావు సితార్, మూడో కొడుకు వీరేంవూదరావు తబలా వాయిస్తారు. ముత్యాలరావుకు సంగీత కచేరీలంటే ఎంత ఇష్టమంటే ఢిల్లీ ఘరానా నుంచి జఫర్ అహ్మద్(చాంద్ ఖాన్‌సాబ్ కొడుకు), నిస్సిన్, హిలాల్, బేగం అఖ్తర్, అమీర్, పర్వీన్‌లాంటి కళాకారులను హైదరాబాదుకు ఆహ్వానించి వారితో కచేరీలను నిర్వహించేవారు. ముత్యాలరావు ఇంకో ప్రత్యేకత సంస్కృత భాష. రాఘవ శర్మ అనే గురువు దగ్గర సంస్కృతం ఆయన సంస్కృత శ్లోకాలు చదివితే ఆ ఉచ్ఛారణకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌లాంటి వాళ్లే అబ్బురపడేవారట. తమకు తెలియనిది ఆయనను అడిగే తెలుసుకునేవారట.


జగ్లూరి ముత్యాలరావు పరిచయం
ముత్యాలరావు 15 ఆగస్ట్, 1921లో పుట్టారు. జన్మస్థలం హైదరాబాద్. స్వాతంత్య్ర సమరంలో, రజాకార్ల వ్యతిరేక పోరాటంలో చురుకుగా పాల్గొని జైలుకు వెళ్లాడు. 1952, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ అసెంబ్లీలో ఆయనే అతిచిన్న ఎమ్మెల్యే. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. తర్వాత ఆంధ్రవూపదేశ్ ఏర్పాడ్డాక గజ్వేల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1962లో మహబూబ్‌నగర్, 1967లో నాగర్‌కర్నూల్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్లమెంటరీ అఫైర్స్, లా అండ్ సోషల్ మంత్రిగా, పెట్రోలియం అండ్ కెమికల్స్ మంత్రిగా సేవలందించారు. డిప్యూటీ ఛీఫ్ విప్‌గా కూడా పనిచేశారు. ప్రత్యక్షరాజకీయాల నుంచి తప్పుకున్నాక 1973లో సొమాలియాకు అంబాసిడర్‌గా నియమితులయ్యారు. కృష్ణమీనన్ రక్షణశాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ముత్యాలరావూ ఓ డెలిగేట్‌గా యూఎన్‌ఓకు వెళ్లాడు, మాట్లాడాడు. యూఎన్‌ఓను సందర్శించిన తొలి షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థి ముత్యాలరావే! చడ్డీజగన్, గయానా అధ్యక్షుడు బన్‌హామ్( burnham) లాంటి వాళ్లు హైదరాబాద్ వచ్చినప్పుడు ముత్యాలరావే వాళ్లను చూసుకునేవారు. నిజానికి అప్పటికి ఆయన రాజకీయాల్లో లేరు. వాళ్లు ప్రభుత్వ అతిథులు. అలాంటి వీవీఐపీలను గవర్నర్ అయినా చూసుకోవాలి లేదంటే ముఖ్యమంత్రి అయినా చూసుకోవాలి. కానీ వాళ్లు తమ ప్రొటోకాల్‌ను కూడా కాదనుకుని ముత్యాలరావుకే ఆ బాధ్యతలను అప్పజెప్పేవారు. ఆ అతిథులూ ముత్యాలరావు సాంగత్యాన్నే కోరుకునేవారు. అంటే ఎంత మంచి సంబంధబాంధవ్యాలుంటే ఇలాంటి గౌరవ మర్యాదలుంటాయి? ఈ లెక్కన ముత్యాలరావుకు అందరితో ఎలాంటి రాపో ఉండేదో ఈ సంఘటనలే తెలుపుతున్నాయి. ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే...నిజాం ఆర్మీలో చీఫ్‌గా పనిచేసిన ఎలె ద్రూస్ భార్య తారా ఎలెవూదూస్ ముత్యాలరావును దత్తత తీసుకున్నారు. సైనిక్‌పురిలో ఓ ముప్పై ఎకరాల స్థలాన్ని కో అపరేటివ్ హౌజింగ్ సొసైటీకి కేటాయించారు ఆయన. అందుకే తర్వాత దానికి ముత్యాలరావు పేరుపెట్టారు.
sulthan
గుర్తులు...
సుల్తాన్ ఎలా అయ్యాడంటే....ముత్యాలరావు ఎమ్‌పీగా ఉన్న తొలినాళ్లలో ఒకసారి కాంగ్రెస్ మీటింగ్ జరుగుతోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో అధ్యక్షుడు (అధ్యక్షురాలు) వేదికలాంటి చిన్న గద్దె మీద కూర్చుంటే సభ్యులంతా కింద కూర్చుంటారు. ఆలాగే ఆ రోజు కూడా నెహ్రూ గద్దె మీద కూర్చున్నారు. మిగిలిన వాళ్లంతా కింద కూర్చుకున్నారు. సమావేశం ప్రారంభం కాబోతున్న తరుణంలో ముత్యాలరావు హాల్లో ప్రవేశించారు. ఆయన వేసుకున్న కుర్తా, పైజామా, ఆ నడక తీరు గమనించి నెహ్రూ మిగిలిన సభ్యులతో...‘యే లడ్‌కా జో హైనా ... హైదరాబాద్ కా సుల్తాన్ జైసా లగ్హ్రా హై’అన్నాడట. అంతే అప్పటి నుంచి నెహ్రూనే కాదు, ఐకే గుజ్రాల్ లాంటి సహచరులూ ఆయనను సుల్తాన్ అని పిలిచేవారు. తర్వాత గుజ్రాల్ ముత్యాలరావుకు రాసిన ఉత్తరాల్లో కూడా డియర్ సుల్తాన్ అనే సంబోధిస్తూ రాసేవాడు. నెహ్రూకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చివరి రోజుల్లో కూడా ముత్యాలరావే దగ్గరుండి సొంత కొడుకుగా సేవలందించారు. నెహ్రూకి దగ్గరి మనిషని గుజ్రాల్‌లాంటి వాళ్లు ముత్యాల్‌రావు పట్ల అసూయను వ్యక్తం చేసేవారట సరదాగా.


ఒక్కడే ఉంటాడు
గయానా అధ్యక్షుడు బర్‌హమ్ అంటే ముత్యాలరావుకు చాలా గౌరవం. అలాగే బన్‌హమ్‌కు ముత్యాలరావంటే వల్లమాలిన అభిమానం. ఆయన వచ్చినప్పుడు పేరుకే రాజభవన్‌లో బస కానీ ముత్యాలరావింట్లోనే విందు, వినోదం అంతా!అందుకే ముత్యాలరావు తన గయానా స్నేహితుడి గుర్తుగా తన మనవడికి తరుణ్‌రాజ్ బన్‌హమ్ అని పేరు పెట్టుకున్నాడు. ‘ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు తొమ్మిది మంది ఉంటారంటారు కానీ ముత్యాల్ లాంటి వాడు మాత్రం ఒక్కడే ఉంటాడ’ని కితాబిచ్చాడు గయానా అధ్యక్షుడు బన్‌హమ్! గయానాలో తన కళ్లను దానమిచ్చారు ముత్యాలరావు.

old
గ్రేట్ ఎండ్...
‘ఏ గొప్ప కితాబుకైనా ముత్యాలరావు అర్హుడే! ఆయన తన జీవితంలోని అన్ని దశలనూ ప్రేమించాడు. రాజకీయాలే కాదు ‘W to MUSIC (ఇక్కడ డబ్ల్యూ అంటే విమెన్, విస్కీ, విన్ లాంటి ఏ అర్థమైనా)’ దాకా అన్నిటినీ ఆస్వాదించాడు. ఆయన సంస్కృత శ్లోకాల ఉచ్ఛారణ వింటే నాకు ఆయన మీద అసూయ కలుగుతుంది. ఆయనో అద్భుతమైన స్నేహితుడు!’ అని ముత్యాలరావును వెటరన్ జర్నలిస్ట్ డి. సీతారామ్ అభివర్ణించాడు. నెహ్రూ సుల్తాన్ అన్నా, పీవీ నరసింహారావు ఆయనను ప్రిన్స్ అన్నా...కించిత్తు అతిశయోక్తి కూడా లేదు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’కు గ్రేట్ ఎగ్జాంపుల్ జగ్లూరి ముత్యాలరావు!
పిల్లల జ్ఞాపకాల్లో.....
రైట్ థింగ్స్..రైట్ ప్లేస్...రైట్ టైమ్!

పి. ఇంద్రాడ్డి యూనివర్సిటీ లా కాలేజ్‌లో నాకు సీనియర్. ఆయన నేతగా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో....ఇబ్రహీంపట్నం సీటు నాకు ఇప్పించాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. నాకూ రాజకీయాలంటే కొంచెం ఆసక్తే కాబట్టి నేనూ ఓకే అన్నాను. అందులో భాగంగా ఓ రోజు రాత్రి ఇంటెలిజెన్స్ నుంచి మఫ్టీలో కానిస్టేబుల్స్ వచ్చారు మా ఇంటికి. అప్పుడు నేను ఇంట్లో లేను. నాన్న ఉన్నాడు. మేము ఫలానా అని వాళ్లు చెప్పగానే..‘ మావోడు ఏం చేసిండు?’ అని అడిగాడట. ‘ఏం చేయలేదు. ఆయన తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలనకుంటున్నాడు. ఫార్మాలిటీగా ఎంక్వయిరీకి వచ్చాం’ అని చెప్పాడట. అంతే నాన్నకు కొపమొచ్చేసింది. ‘నేను బతికుండగా వాడు తెలుగు దేశం నుంచి పోటీ చేస్తాడా’ అంటూ చడామడా తిట్టి వాళ్లను పంపించేశాడట. ఆ కానిస్టేబుళ్లు వెళ్లి ఇంద్రాడ్డి దగ్గర భోరుమన్నారు. ఆయన నన్ను పిలిచి...‘నాన్న పెద్దాయన కదా...ఇంటికొచ్చి నేను అడగనా’ అన్నాడు. అప్పటికే నాన్న అమ్మకు వార్నింగ్ ఇచ్చాడట...‘వాడు గనక పోటీ చేస్తే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేద’ని. అందుకనే ఇంద్రాడ్డికి వద్దని చెప్పాను. అయినా ఆ టర్మ్ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తుతో ఇబ్రహీంపట్నం సీటు కమ్యూనిస్ట్ పార్టీకే పోయింది. అలా నా రాజకీయాలకు నేను దూరంగానే ఉన్నాను. అన్న (గజేంవూదరావు)కు రాజకీయాల్లో చేరాలని ఇష్టమే కానీ నాన్నకే ఇష్టంలేక అన్న ధైర్యం చేయలేదు. ఇంట్లో ఎప్పుడూ నాన్న రాజకీయాల గురించి చర్చించే వాడు కాదు. ఇంట్లో ఉన్నంత సేపు విందులు, వినోదాలు..లాంటి హ్యాపీ లైఫ్‌నే ఎంజాయ్ చేశాడు. మమ్మల్ని కూడా అలాగే ఉండమనేవాడు. ఆయన రాజకీయ పలుకుబడిని కూడా మాకోసం ఉపయోగించిన దాఖలా లేదు. ఎవరికి వారే కష్టపడి జీవితాన్ని నిర్మించుకోవాలని చెప్పేవాడు. అయితే మా భవిష్యత్తుకు మాత్రం మంచి పునాదే వేశాడు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని మంచి స్కూళ్లలోనే చదివించాడు. ఆయన నుంచి మాకు అబ్బిన గుణాలు...హార్డ్‌వర్క్, డిసిప్లిన్! చేసిన పని చిన్నదైనా సరే పర్‌ఫెక్ట్‌గా చేయాలనేది ఆయన సిద్ధాంతం! అందుకే ఇంట్లో కూడా రైట్ థింగ్స్ రైట్ ప్లేస్‌లో, రైట్ టైమ్‌లో లేకుంటే...ఊరుకునేవాడు కాదు. ఆయన పార్టీలు అరేంజ్ చేస్తే కూడా ఏ ఒక్కటి మిస్సయినా గయ్‌మనేవారు. చివరకు గ్లాస్ నీట్‌గా లేకపోయినా మా పని అయిపోయేది. ఇప్పటికీ ఎక్కడికైనా వెళ్లినప్పుడు..డిఫెన్స్‌లో ఉద్యోగం చేసేవాళ్లు, టెలికమ్యూనికేషన్స్‌లో ఉద్యోగం చేసేవాళ్లు తారసపడి...‘నాన్నే మాకీ ఉద్యోగం ఇప్పించాడు. ఆయన వల్లే మేమీరోజు ఈ స్థితిలో ఉన్నామ’ని చెప్తుంటే మనసంతా ఒక రకమైన సంతోషంతో నిండిపోతుంది. ముత్యాల్‌రావు పిల్లలా మీరు అని మాకు మర్యాద ఇస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ఆస్తులు, ఆంతస్థులు అశాశ్వతం! ఆ పేరు చాలు శాశ్వతంగా ఉండిపోవడానికి! ఆయన పిల్లలుగా ఇంతకన్నా మాకేం కావాలి!

old1
ఒక్క విగ్రహం లేదు
షెడ్యూల్ కమ్యూనిటీ నుంచి మంత్రిగా ఎదిగిన ఒకే ఒక వ్యక్తి నాన్న. ఆయన సేవలను ప్రభుత్వం చాలా అలక్ష్యం చేసింది. అందుకే ఈ జంటనగరాల్లో ఎక్కడా ఆయన విగ్రహం లేదు. అదే ఉన్నత కులస్థులు ఎవరైనా నాన్నలా ఎదిగి ఉంటే ఇంత నిర్లక్ష్యం చేసేది కాదు ప్రభుత్వం. ఈ విషయంలోనే నాన్నకు అన్యాయం జరిగిందనిపిస్తుంది!

జె.ఎమ్. గజేంవూదరావు
( ముత్యాలరావు పెద్ద కొడుకు).
జె.ఎమ్. బాబూరావు, వ్యాపారవేత్త, (ముత్యాలరావు రెండో కొడుకు).

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine