మనసు కథమనసు కథ
వూదకు నభై ఏళ్లు.
ఇప్పటికీ సినిమాలు చూడటమంటే అతనికి పిచ్చి. ఫలానా సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఉందని తెలిస్తే ఎంత దూరమైనా వెళ్లి చూసొస్తాడు. అలాంటి సినిమాల కోసం సీడీ షాప్‌లకు వెళ్లి వారానికోసారి వాకబు చేస్తుంటాడు. ఫ్రెండ్స్‌ను అడుగుతుంటాడు. ఆయనకు అదో అలవాటు. ఆయనకు ఒక్కడే కొడుకు. సునీల్. అతనితో సురేంవూదది కేవలం రక్తసంబంధమే కాదు. ఫ్రెండ్‌షిప్ కూడా! అప్పుడప్పుడూ కొడుకు ముందు చిన్న పిల్లాడైపోతాడు సురేంద్ర. ఒక్కోసారి వాళ్లావిడ అడుగుతుంది ‘ఎందుకంత ఎక్స్‌వూటాలు చేస్తవ్’ అని! తాను మాత్రం ‘పిల్లల మనసుకు ఇంకా దగ్గర కావాలంటే ఏం చేయాలి? అని ఆమెను ఎదురు ప్రశ్నిస్తుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే తండ్రి ప్రేమ గురించి పిల్లలు గొప్పగా చెప్పుకోవాలనే ఆశ కూడా ఉంది ఆయనకు.
ఆ ప్రేమను సునీల్ బాగానే ఆస్వాదిస్తాడు కానీ కొన్నిసార్లు ‘అతివూపేమా?’ అన్నట్టు అనుమానంగా చూస్తాడు. అంతమావూతాన తండ్రి ప్రేమను తక్కువ చేసి మాట్లాడలేదెప్పుడూ. అయితే కొన్ని సందర్భాల్లో ‘ఈయనొక్కడే తండ్రి అయినట్టు తెగ బిల్డప్ ఇస్తాడేంట్రా....’ అని చెవులు కొరుక్కున్న తమ బంధువులను, సురేంద్ర కొలీగ్స్‌ను చూశాడు సునీల్. కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఒకరోజు సునీల్ చదువుతున్న కాలేజ్ ఫంక్షన్‌కి వెళ్లాల్సి వచ్చింది సురేంద్ర... అతని భార్యతో కలసి!
అన్నిట్లో ‘ఫస్ట్’ ర్యాంకర్ సునీల్‌కు ప్రశంసల జల్లు. తండ్రిగా సురేంద్ర ఎంతో మురిసిపోయాడు. కాలేజీ యాజమాన్యం సహా అంతా తెగ పొగిడేశారు. ఇంటికొచ్చిన తరువాత చుట్టుపక్కలవాళ్లు కూడా మెచ్చుకున్నారు. అతని ఆనందానికి అవధుల్లేవు.
కొన్ని రోజుల తరువాత...
జనవరి ఫస్ట్ వచ్చింది. తండ్రీకొడుకులు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారు. సునీల్ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. అందమైన పెన్ను.... దానికింద ఓ పేపర్ ఉంది. అత్రంగా చదువుతున్నాడు సునీల్.
‘ఈ ప్రపంచానికి నేను నీ తండ్రిగా పరిచయం కావాలి. అంత ఎత్తుకు ఎదగాలి నువ్. ఆల్ ద బెస్ట్’ అని!
సురేంద్ర రూమ్‌లో...
గిఫ్ట్ ఓపెన్ చేశాడు...కొత్త డైరీ. ధగధగ మెరిసిపోతున్నది. మొదటి పేజీ ఓపెన్ చేశాడు...
‘నీకు అమ్మ ప్రేమొక్కటే తెలుసు. నాకు నాన్న ప్రేమ కూడా తెలుసు. ఇంకో జన్మంటూ ఉంటే నువ్వు నా కొడుకుగా పుట్టాలి. అప్పుడుగానీ నీ రుణం తీర్చుకోలేను...’
ఆనంద భాష్పాలతో ఆయన చేతిలోని డైరీ తడిసిపోతున్నది.
Other News