మనసు కథ

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?’ అడిగాడు కార్తీక్.
‘లేదు’ చెప్పింది అనన్య.
కార్తీక్ మళ్లీ అడిగాడు. అనన్య లేదని చెప్పింది. అలా చాలాసార్లు జరిగింది.
ఒకరోజు కార్తీక్ మళ్లీ ప్రపోజ్ చేశాడు. ‘లేదని చెప్పాకదా ఎన్నిసార్లు అడుగుతావ్?’ అని కోప్పడింది అనన్య.
‘థాంక్ గాడ్. మీ ఫ్రెండ్ నాతో డేటింగ్‌కి వస్తానంది. నువ్వు లవ్ చేయడం లేదంటే తనతో వెళ్లిపోదామనుకుంటున్నాను. అందుకే కన్ఫామ్ చేసుకుందామని అడిగాను’ అని చెప్పాడు కార్తీక్.
అనన్య భోరున ఏడ్చింది. కార్తీక్ కాలర్ పట్టుకుని ‘దానితో వెళ్తే చంపేస్తా’ అంది.
‘నువ్వు ప్రేమించ నేను ఎవరితో వెళ్తే నీకెందుకు?’ అడిగాడు కార్తీక్.
‘లేదూ.. నువ్వంటే నాకు చాలా ఇష్టం’ సిగ్గు పడింది అనన్య.
‘నాకు తెల్సు. ఇది చెప్పించాలనే.. అమ్మాయి.. డేటింగ్...అని అబద్ధం చెప్పాను’ అన్నాడు.
రెండేళ్ల తర్వాత..
‘మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. నువ్వు ఇప్పటి వరకు ఏ జాబ్ చేయడం లేదు. నాకు భయమేస్తోంది’ అంది అనన్య.
‘ఒకరి దగ్గర పనిచేయడం నాకు ఇష్టం ఉండదు. నేను సొంతంగా ఏదైనా బిజినెస్ మొదపూడదామనుకుంటున్నాను’ చెప్పాడు కార్తీక్.
‘నువ్వు స్టార్ట్ చేసేలోపు మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాడు. నీ ఇష్టం’ అని వెళ్లిపోయింది అనన్య.
ఐదేళ్ల తర్వాత..
కార్తీక్ రోడ్డు వెంట నడుస్తూ సిగట్ తాగుతున్నాడు.
అతని పక్కన కారు ఆగింది. అనన్య అందులో నుంచి దిగి కార్తీక్ దగ్గరికి వచ్చింది.
‘నువ్వింకా సిగట్లు మానలేదా?’ అడిగింది అనన్య.
‘లేదు. ఎలా ఉన్నావ్?’ అన్నాడు కార్తీక్.
‘బావున్నా. నిన్ను చేసుకుంటే ఇలా ఉండేదాన్ని కాదేమో!’ అంది.
ఇంతలో ఇంకో కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒకతను ఫైల్స్ పట్టుకుని వీళ్ల దగ్గరికి వస్తున్నాడు.
‘ఆయనే మా ఆయన. ఈ కంపెనీలోనే పనిచేస్తున్నాడు. మూడు లక్షలు జీతం’ గర్వంగా చెప్పింది అనన్య.
‘నువ్వేంటి ఇక్కడ?’ అనన్యని అడిగాడు కారులో వచ్చిన వ్యక్తి.
‘కార్తీక్ నా క్లాస్‌మేట్. ఇక్కడ కనిపిస్తే మాట్లాడుతున్నాను’ చెప్పింది అనన్య.
‘ఈయనే మా బాస్’ అని అనన్యకి చెబుతూ ‘సార్ వీటి మీద అర్జెంట్‌గా మీ సంతకం కావాలి’ అని కార్తీక్‌ని అడిగాడు అనన్య భర్త.
కార్తీక్ సంతకం చేశాడు.
Other News