మనసు కథ
కొన్ని సినిమా లవ్ స్టోరీలకు విషాదాంతాలున్నట్లే కొంతమంది సినిమా తారల ప్రేమ కథలకూ విషాదాంతాలున్నాయి. దేవానంద్- సురయా, దిలీప్ కుమార్ - మధుబాల అలాగే సులక్షణా పండిత్ ప్రేమకూ ఎండింగ్ విషాదమే. 1970, 80 దశకాల్లో బాలీవుడ్ మెచ్చిన బెస్ట్ హీరోయిన్ సులక్షణాపండిట్. షమ్మీకపూర్, శశికపూర్, జితేంద్ర, సంజీవ్‌కుమార్, అమితాబ్ బచ్చన్, రాజేశ్ ఖన్నాలాంటి మేటి హీరోల సరసన నటించింది. ఆమె మంచి గాయని కూడా. సంజీవ్ కుమార్‌తో ప్రేమలో పడింది. అయితే సంజీవ్ కుమార్ అప్పటికే హేమామాలినితో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నాడు. పెళ్లి చేసుకొమ్మని హేమామాలిని వెంట కూడా పడ్డాడు. కానీ హేమామాలినేమో ధర్మేంవూదతో ప్రేమలో పడిపోయింది. పెళ్లంటూ చేసుకుంటే ఆయననే చేసుకోవాలని నిర్ణయించుకుంది. పాపం...సంజీవ్ కుమార్ హేమామాలిని మనసు మార్చాలని శతవిధాలా ప్రయత్నించాడు. ‘పెళ్లయి, అంతెత్తు బిడ్డలున్నవాడిని ఏం చేసుకుంటావ్?, రెండో భార్యగా నీ స్థానాన్ని ఊహించు సమాజంలో’ అంటూ చాలానే భయపెట్టాడు ఆమెను. ఏంచెప్పినా లాభం ఇల్లే అంది హేమామాలిని. ధర్మేంవూదనే పెళ్లి చేసుకుంది. హార్ట్ బ్రేక్ అయి ఉన్న సంజీవ్‌కుమార్‌కు సులక్షణ దగ్గరైంది. ఆయనను ప్రాణంగా ప్రేమించింది.
హేమామాలిని కాదన్నందుకు అవమానంతో ఉన్న సంజీవ్ మనసు కుదుటపడేలా, మామూలు మనిషయ్యేలా చేసింది. ఆయనకు బైపాస్ సర్జరీ అయితే సేవలూ అందించింది. ఆరోగ్యం కుదుటపడ్డాక ఢిల్లీలో ఉన్న ఆంజేనేయస్వామి గుడికి వెళ్లారిద్దరూ! అక్కడ తన మనసులో మాటను బయట పెట్టింది సులక్షణ...తనను పెళ్లి చేసుకొమ్మని. తన ఫస్ట్ లవ్ హేమామాలినిని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని, ఆమెకు తప్ప తన జీవితంలో ఎవరికీ చోటు లేదని సులక్షణ కోరికను తిరస్కరించాడు సంజీవ్‌కుమార్. అన్నట్టుగానే సంజీవ్‌కుమార్ బ్రహ్మచారిగానే మరణించాడు. సంజీవ్ కాదన్న సులక్షణా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. సులక్షణ పండిట్ జస్‌రాజ్‌కు మేనకోడలి వరుస అవుతుంది. అంతేకాదు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ జతిన్, లలిత్‌లకు స్వయానా అక్క.
Other News