స్పెషల్ డిష్
వేపుళ్లు, పులుసులు రోటిన్. సలాడ్‌లు, సూప్‌లు కామన్. మరి వేరే ఏ రెసీపీలు తెలియవు కదా! అనుకుంటున్నారా? అయితే.. నోరు తిరగని పేర్లతో ఉన్న ఈ నోరూరించే వంటకాలను చేసి కొత్త రెసీపీలను మీ మెనూలో చేర్చండి...
ఫంగీ మెరినటీ
కావల్సిన పదార్థాలు:
మష్రూమ్స్ - 10
వెల్లుల్లిపాయలు - 1షగా.
నిమ్మకాయ - 1
కొత్తిమీర - ఒక కట్ట
మిరియాలపొడి - 1 టీ స్పూన్
ఆలివ్ ఆయిల్ - 10మి.లీ.
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం: ఒక గిన్నెలో వెల్లుల్లిపాయలను చిన్నముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో నిమ్మరసం, కొత్తిమీర, మిరియాలపొడి, ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓ ఐదునిమిషాలు అలాగే ఉంచాలి. మష్రూమ్‌ల పైన చిన్న గాట్లు పెట్టాలి. వెల్లుల్లిపాయలతో కలిపిన మిశ్రమాన్ని ఇందులో కూరాలి. పై నుంచి నిమ్మరసం చల్లి ఓవెన్‌లో బేక్ చేయాలి. పదినిమిషాల తర్వాత నోరూరించే ఫంగీ మెరినటీ మీ ముందుంటుంది.
బ్రుషెట్టా
కావల్సిన పదార్థాలు:
బ్రెడ్‌ముక్కలు - 4
టమాటాలు - 25ఱగా.
ఉల్లిగడ్డలు - 4ఱగా.
కొత్తిమీర - ఒక కట్ట
మోజిరిల్లా చీజ్ - షగా.
తులసి ఆకులు -
వెల్లుల్లిపాయలు - షగా.
ఉప్పు - తగినంత
ఆలివ్ ఆయిల్ - 10మి.లీ.
తయారు చేసే విధానం: టమాటాలను చిన్నముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఉల్లిగడ్డలను కూడా పొరలు వచ్చేవిధంగా కట్ చేయాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలపై చీజ్ రాసి వెల్లుల్లిపాయలను, కట్ చేసుకున్న టమాటాలను, ఉల్లిపాయ ముక్కలను జాగ్రత్తగా పెట్టాలి. తులసాకులు, కొత్తిమీర, ఉప్పును పైనుంచి చల్లాలి. ఆలివ్ ఆయిల్‌ని ఈ నాలుగు బ్రెడ్‌ముక్కలపై పోయాలి. ఈ ముక్కలను ఓవెన్‌లో ఐదు నిమిషాల పాటు బేక్ చేయాలి. ఈ వేడి.. వేడి బ్రుషెట్టాని ఆరగించవచ్చు.
సేకరణ: సౌమ్య నాగపురి
ఫోటోలు : వీరగోని రజనీకాంత్
Other News