భలే.. పాలకూర!
నేను వరంగల్ జిల్లాలోని ఘణపురం మండలం విద్యా వనరుల కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. నాకు అన్ని కూరల్లో పాలకూర అంటే చాలా ఇష్టం. పచ్చగా.. నిగనిగలాడుతూ చూడగానే తినాలనిపిస్తుంది. నేను డిగ్రీ చదివే రోజుల్లో మా ఊరి పక్కన ఉన్న భూపాలపల్లికి వెళ్లేవాడిని. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెమ్మని చెప్పేది అమ్మ. ఆ లిస్ట్‌లో పాలకూర ఉండాల్సిందే! ఆ తర్వాత రోజు స్వయంగా నేనే పాలకూర వండాల్సిందే! అమ్మా, నాన్న నా పాలకూరకి ఫ్యాన్స్. పాలకూరంటే నేనే చేయాలి అంతే. ఒకసారి మా ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగింది. దానికి వంట వాళ్లని పిలిచారు. వాళ్లు మటన్, చికెన్ వండారు. నాకెందుకో నేను వండిన పాలకూర రుచి అందరికీ చూపించాలనిపించింది. వెంటనే పాలకూర ఫ్రై చేశాను. మా బంధువులంతా చికెన్, మటన్ కంటే కూడా పాలకూరే బాగుందని నన్ను తెగ పొగిడారు. నాకు చాలా సంతోషం అనిపించింది. పాలకూర ఒక్కటే కాకుండా ఒక్కోసారి కూరగాయలు కలిపి ప్రయోగాలు చేస్తుంటాను. ఇక అప్పుడప్పుడు పాలకూర కత్తిరించుకొని తినడమన్నా భలే ఇష్టం. అందుకేనేమో నాకు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు.
మా అడ్రస్ :
జిందగీ (తొలితాలింపు),
నమస్తే తెలంగాణ,
8-2-603/1/7,8,9,
కృష్ణాపురం, బంజారాహిల్స్,
రోడ్ నెం. 10,
హైదరాబాద్- 500 034.
Other News