|
|
Home >> Zindagi >> Josh 4 Uth
ఎంతో రుచికరం
మాది చిట్యాల మండలం. స్కూలు చదువంతా మా ఊర్లోనే. కాలేజీ కోసం హన్మకొండ వెళ్లాల్సి వచ్చింది. ఫస్ట్‌ఇయర్ హాస్టల్‌ల్లో ఉన్నాం. కానీ సెకండియర్ కాలేజ్ హాస్టల్ వద్దనుకొని నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్‌ను అద్దెకు తీసుకున్నాం. ఒకొక్కరం ఒక్కో పని చేసేవాళ్లం. నాది వంట డ్యూటీ. ఒకరోజు భారీ వర్షం. బయటకు వెళ్లి కూరగాయలు తెచ్చే వీలు కాలేదు. ‘ఏం చేయాలా?’అని ఆలోచించి అన్నమైతే వండాను. వర్షం తగ్గేలా లేకపోతే.. అన్నంలో కారం, పసుపు, ఉప్పు వేసి కలిపాను. ఒక కడాయిలో నూనె పోసి కొత్తిమీర, కరివేపాకు వేసి పోపన్నం చేసేశాను. అందరికీ ఆకలయిందేమో బాగా తిన్నారు. అందరూ ఇక ఆ రోజు నుంచి నా పోపన్నానికి ఫ్యాన్స్ అయిపోయారు. రోజూ ఏదో ఒక పూట పోపన్నం చేయించేవారు. నాకు కూడా అదే సులువనిపించేది. కాకపోతే ఈ విషయం మా కాలేజీలో తెలిసిపోయింది. ఇక కాలేజీలో సార్లతో సహా ‘ఈ రోజు పోపన్నం తెచ్చుకోలేదా?’అని మమ్మల్ని ఆటపట్టించేవారు. కొందరైతే.. ‘పోపన్నం.. పోపన్నం..’అంటూ కొత్త లిరిక్స్ రాసి పాడుతుండేవాళ్లు. చివరికి నేను అలా పోపన్నం స్పెషలిస్ట్‌నయ్యాను.
- కె.సతీష్, చిట్యాల, వరంగల్ మా అడ్రస్ : జిందగీ (తొలితాలింపు), నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, బంజారాహిల్స్, రోడ్ నెం. 10, హైదరాబాద్- 500 034.
Other News
|
|