వంకాయకే ఓటు
నేను పరకాలలో ఒక ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్నాను. అంతేకాదు, పక్కనే ఉన్న గుడిలో పౌరోహిత్యం కూడా చేస్తుంటాను. నాకు వంకాయ, టమాటా అంటే బాగా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. రోజూ పెట్టినా కూడా తినేస్తాను. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిపి ఒక గది కిరాయికి తీసుకొని ఉండేవాడిని. నేనెప్పుడైనా మార్కెట్ వెళ్తే వంకాయ, టమాటాలు మాత్రమే తెచ్చేవాడిని. పదిరోజుల వరకు వంకాయ ఒకరోజు, టమాటా ఒకరోజు, ఆ రెండు కాంబినేషన్ కర్రీలే వండేవాడిని. మా ఫ్రెండ్స్ అయితే నన్ను ఏమీ అనలేక ఆ కూరలకే అలవాటు పడ్డారు. కారణం వారికి వంట రాకపోవడమే! ఇప్పుడు నాకిద్దరు కూతుళ్లు. ఇద్దరి పెళ్లిళ్లు అయిపోయాయి. వారి ఇంటికి వెళ్లినా నాకు ఈ కూరలతోనే విందు భోజనం. వివిధ ప్రాంతాలకు పౌరోహిత్యం చేయడానికి అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ కూడా ఇదే కూర ఉండాల్సిందే! ఒకరోజు పని మీద ఉదయమే మా స్నేహితుడు ఇంటికి వెళ్లాను. మాట్లాడుతూ ఉండగా భోజన సమయం అయింది. నేను మనసులో ‘ఏం కూర వండారో?’అనుకుంటూ తినడానికి ఉపక్షికమించాను. నా ఫ్రెండ్ నవ్వుతూ.. ‘నీకు ఇష్టమైన కూరే వండించాను మిత్రమా!’ అంటూ వంకాయ, టమాట కూర ముందుంచాడు. తన సెల్‌ఫోన్‌లో నా పేరుకు బదులు వంకాయ అని పెట్టుకున్నాడు. ఎంతైనా... కూరలలో రాజు వంకాయ కదా!
మా అడ్రస్ :
జిందగీ (తొలితాలింపు),
నమస్తే తెలంగాణ,
8-2-603/1/7,8,9,
కృష్ణాపురం, బంజారాహిల్స్,
రోడ్ నెం. 10,
హైదరాబాద్- 500 034.
Other News