మసాలా మందు
ముర్గ్ సుల్తాన్
కావలసిన పదార్థాలు:
చికెన్ - 25ఱగా.
ఉల్లిగడ్డలు - 2
కాజు - వగా.
టమాటాలు - 5ఱగా.
మిలన్ సీడ్స్ - లగా.
కారం - 1 స్పూన్‌లు
గరం మసాలా - లగా.
ధనియాల పొడి - లగా.
పసుపు - చిటికెడు
యెల్లో చిల్లీ పౌడర్ - 1 స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - లగా.
పెరుగు - 1షగా.
కొత్తిమీర - ఒక కట్ట
నెయ్యి, నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:కడాయిలో కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయలను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. దీంట్లో పెరుగు కలిపి దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. కాజు, మిలన్ సీడ్స్‌ను కలిపి గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలను కూడా ఉడికించి ప్యూరీలా తయారు చేయాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, చికెన్ వేసి కలపాలి. దీంట్లో పసుపు, టమాటా ప్యూరీ వేసి కలియబెడుతూ ఉండాలి. బాగా ఉడికిన తర్వాత కారం, యెల్లో చిల్లీ పౌడర్, మసాలా, ధనియాలపొడి, కాజు, మిలన్‌సీడ్స్ పేస్ట్, కొంచెం నెయ్యి వేసి మరో ఐదునిమిషాల పాటు ఉడకనివ్వాలి. కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది. ముర్గ్ సుల్తాన్ ఘాటు, ఘాటుగా బాగుంటుంది.
రెస్‌మీ కబాబ్
వర్షాకాలం జలుబులకు మసాలా నాన్ మంచి మందు. అందుకే ఘాటైన కోడికూరలను ఈ మెనూలో చేర్చాం మీ కోసం..!
కావలసిన పదార్థాలు:
చికెన్ - 25ఱగా.
పెరుగు - 2షగా.
బటర్ - 1ఱగా.
చీజ్ - షగా.
ఇలాయిచీ పౌడర్ - లగా.
ఉప్పు - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్‌లు
కోడిగుడ్లు - 3
తెల్ల మిరియాలపొడి - ళగా.
తయారు చేసే విధానం:చికెన్‌ని కడిగి నీళ్లు లేకుండా ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో పెరుగు, బటర్, చీజ్, ఇలాయిచీ పౌడర్, ఉప్పు, నిమ్మరసం వేసి అరగంటపాటు అలాగే ఉంచాలి. ఇప్పుడు ఈ ముక్కలను సీకులకు గుచ్చి బొగ్గుల మీద కాల్చాలి. అది కూడా సగమే. తర్వాత గిన్నెలో కోడిగుడ్డు తెల్లసొన తీసుకొని అందులో తెల్లమిరియాల పొడి వేయాలి. ఈ మిశ్రమంలో సగం ఉడికిన చికెన్ ముక్కలను ముంచి సీకు గుచ్చాలి. మళ్లీ బొగ్గుల మీద కాల్చాలి. రెస్‌మీ కబాబ్ మీ ముందుంటుంది.
Other News