మిర్చీ ఉప్మా
నాకసలు వంట అంటే ఏంటో తెలియదు. అమ్మనో, అక్కనో ఎవరో ఒకరు చేసి పెడుతుంటారు. కానీ 2004 సంవత్సరంలో ఒకరోజు నేను వంటచేయాల్సి వచ్చింది. అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. ఆ రోజు.. అమ్మ, అక్క, అన్నయ్య ఏదో పనిమీద బయటకు వెళ్లారు. మధ్యాహ్నం స్కూలు నుంచి వచ్చా. వండిన కూరలు నచ్చలేదు. ఏం చేయాలా? అని ఆలోచించాను. అప్పుడప్పుడు అమ్మ చేసే ఉప్మా చూసినట్లు గుర్తు. అందుకే అది ట్రై చేద్దామనుకున్నాను. గిన్నె పెట్టి అందులో నూనె పోసి జీలకర్ర, ఓ పది, పన్నెండు మిరపకాయలు వేసి వేగాక నీళ్లు పోసి ఉప్మా రవ్వ వేశాను. అది ఓ ముద్దలా తయారయ్యింది. ఆకలి మీద ఉన్నా కదా గబగబా తినేసి స్కూలుకు వెళ్లిపోయా. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆ ఉప్మాని చూసి అమ్మ ‘నిన్ను ఎవరు చేయమన్నారు? ఇన్ని మిరపకాయలు ఉప్మాలో వేసుకుంటారా ఎవరైనా? అసలు ఉప్పు కూడా లేదు. ఎలా తిన్నావురా?’ అంది. ఆ తర్వాత నవ్వుల్లు. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే ఇంట్లో అంతా నవ్వులమయమే!
Other News