Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> Zindagi >> Josh 4 Uth


వెజ్ N నాన్‌వెజ్

అన్నీ సమపాళ్లలో కలిస్తేనే రుచి కుదురుతుంది. దేనికైనా మరింత పెంచే ఎస్సెన్స్ యాడ్ చేస్తేనే డిషెస్ డిలీషియస్‌గా మారుతాయి. అలాంటి ఓ వెజ్ అండ్ నాన్‌వెజ్ చూడండి!

beansబీన్స్ ఉస్లీ
కావలసిన పదార్థాలు:
బీన్స్ - 300గ్రా.
శనగపప్పు - 100గ్రా.
కొబ్బరి తురుము - షగా.
పచ్చిమిరపకాయలు - 8
ఉల్లిగడ్డ - 1
జీలకర్ర - 1గ్రా.
ఆవాలు - 1గ్రా.
ఎండు మిరపకాయలు - 3
వెల్లుల్లిపాయలు - 1గ్రా.
కొత్తిమీర - ఒక కట్ట
కరివేపాకు - ఒక కట్ట
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం:
బీన్స్‌ని ఉడికించాలి. శనగపప్పును నానబెట్టి పొడి కొట్టుకోవాలి. దీన్ని కాస్త నూనె వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తరువాత కరివేపాకు బీన్స్, శనగపప్పు పొడి, పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు, పసుపు, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. బాగా వేగాక కొత్తిమీర చల్లుకొని దించేయాలి. బీన్స్ ఉస్లీ రెడీ!


mottonమటన్ లుకునీ
కావలసిన పదార్థాలు:
మటన్ - 250గ్రా.
ఆలుగడ్డలు - 80గ్రా.
ఉల్లిగడ్డలు - 2
బాస్మతీ రైస్ - 500గ్రా.
ఇలాయిచీ పౌడర్ - 2గ్రా.
షాజీరా -1గ్రా.
లవంగాలు - 1గ్రా.
దాల్చిన చెక్క పొడి - 1గ్రా.
ఉప్పు - తగినంత
కారం - 1స్పూన్‌లు
పచ్చిమిరపకాయలు - 10
కొత్తిమీర - ఒక కట్ట
పుదీనా - ఒక కట్ట
నెయ్యి - 10గ్రా.
నూనె - 10గ్రా.
పెరుగు - 25గ్రా.
కాజు - 20గ్రా.
నిమ్మరసం - 3 స్పూన్‌లు

తయారు చేసే విధానం:
ఆలుగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను పేస్ట్ చేయాలి. ఉల్లిగడ్డలను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్‌ని ఒక గిన్నెలో తీసుకొని అందులో సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క పొడి, ఇలాయిచీ పొడి, ఉప్పు, వేయించుకున్న ఉల్లిపాయలు, కారం, పచ్చిమిరపకాయల పేస్ట్, ఆలుగడ్డలు, పెరుగు, నూనె, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, నీళ్లను కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక అరగంటసేపు నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యాన్ని సగం ఉడికించాలి. ఇప్పుడు కొంచెం పెద్ద గిన్నెను తీసుకొని కలిపి ఉంచిన మటన్‌ను అందులో వేయాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు సగం ఉడికిన బియ్యాన్ని వేసి గట్టిగా మూత పెట్టాలి. ఇలా తయారయైన అన్నాన్ని ఓ గిన్నెలో తీసుకొని పై నుంచి కాజు వేసి సర్వ్ చేయాలి. వేడి.. వేడి.. మటన్ లుకునీ నోరూరిస్తుంది.

ఫోటోలు: భాస్కర్
షెఫ్ : నరసింహ
ఛత్తీస్ 36

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine