మనసు కథ
సుమలత బంధువుల ఇంట్లో పెళ్లి. వాళ్ల ఫ్యామిలీ అంతా అక్కడే వాలిపోయింది.
అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి. చాలాకాలం తర్వాత తమ బంధువులందరినీ కలుసుకున్నందుకు ఆమెకు ఎంతో హ్యాపీగా ఉంది. తన ఈడు అమ్మాయిలు చాలామందే ఉన్నారు తమ బంధువుల్లో. వాళ్లంతా పెళ్లిలో కలిశారు. అంతాకలిసి ఎంజాయ్ చేశారు. నిజం చెప్పాలంటే ఆ వివాహ వేడుకలో సుమలతే సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా అయ్యింది.
పెళ్లి అయిపోయింది. తెల్లవారితే ఎవరింటికి వాళ్లు వెళ్లిపోవాల్సిందే. రాత్రి ఎనిమిదవుతున్నది టైమ్. సుమలత సహా అమ్మాయిలంతా అప్పటిదాకా ఆ ఇంట్లో వాళ్లంతా కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఓ చోట కూర్చున్నారు. ఆ అమ్మాయిల్లో ఒకరు ‘మీ మీ లవ్‌స్టోరీలు చెప్పండి’ అంటూ ఓ టాపిక్‌ను అందరిముందు వేసింది.
తలో ‘కథ’ చెప్పారు. సుమలత వంతు వచ్చింది.
‘నాకే లవ్‌స్టోరీ లేదు’ అన్నది.‘సుత్తి కొట్టొద్దమ్మా. మేమంతా చెప్పుకోలేదా?’ అంటూ ఎంకరేజ్ చేశారు మిగతావాళ్లు. ఇంతలో పెద్దవాళ్లు కూడా వచ్చి ఆ బ్యాచ్‌లో చేరిపోయారు. టాపిక్ మారిపోయింది. అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. జోకులు, కామెంట్లు....ఐదు నిమిషాల్లో గోలగోలగా మారిపోయింది అక్కడి వాతావరణం. అనుకోకుండా టాపిక్ అమ్మాయిల వైపు తిరిగింది. వాళ్లలో వరసకు తాత అయ్యే ఒక పెద్దాయన ఆ గ్యాంగ్‌లో ఓ అమ్మాయిని నవ్వుతూ అడిగాడు ‘నీకు ఎలాంటి భర్త కావాలి’ అని. ‘నన్ను బాగా చూసుకోవాలి. ముఖ్యంగా తాగే అలవాటు ఉండకూడదు’ అందామె.
అలాగే ఇంకో అమ్మాయిని అడిగాడు ‘నేను చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డాను. నన్ను సుఖపె కావాలి’ అంది.
క్రమంగా మ్యాటర్ ఇంటస్టింగ్ మారిపోయింది. ఒక్కొక్కరు తమకు ఎలాంటివాడు భర్తగా రావాలో చెప్పుకుంటున్నారు. కొందరు డబ్బు గురించి, కొందరు ప్రేమ గురించి, కొందరు క్యారెక్టర్ గురించి మాట్లాడారు. మళ్లీ సుమలత వంతు వచ్చింది. ‘నీకేం ఆశలు ఉన్నయ్ చేసుకోబోయే వాడి మీద’ అని అడిగాడాయన. ‘అతడు చాలా వీక్ హార్టెడ్ అయి ఉండాలి తాతయ్య. ఎంతగా అంటే నేను లేకుండా బతకలేనంత వీక్‌హ్టాడ్ కావాలి’ అంది. తాతయ్య చిన్నగా నవ్వాడు. అమ్మాయిలంతా ఆలోచనలో పడిపోయారు.
Other News