మసాలా నాన్‌వెజ్
అంగూరీ ముర్గ్
కావలసిన పదార్థాలు:
చికెన్ - 20ఱగా.
ఉల్లిగడ్డలు - 10ఱగా.
అల్లం - 2ఱగా.
వెల్లుల్లిపాయలు - 2ఱగా.
యెల్లో చిల్లీ పౌడర్ - 2ఱగా.
నూనె - 30మి.లీ.
గరం మసాలా - 1ఱగా.
బీట్‌రూట్ జ్యూస్ - 30మి.లీ.
చక్కెర - 1ఱగా.
నిమ్మరసం - 10మి.లీ.
ఇలాయిచీ పౌడర్ - షగా.
బటర్ - 2ఱగా.
క్రీమ్ - 2ఱగా.
కిస్‌మిస్ - 1ఱగా.
ద్రాక్షపండ్లు - 6
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
కడాయిలో నూనె పోసి ఉల్లిపాయముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. దీంట్లో అల్లం, వెల్లుల్లిపాయలు వేగాక చికెన్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత యెల్లో చిల్లీ పౌడర్ వేయాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత బీట్‌రూట్ జ్యూస్ పోసి మరికాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు గరంమసాలా, చక్కెర, ఇలాయిచీ పౌడర్ వేసి కాసేపు ఆగాలి. తర్వాత బటర్, క్రీమ్, నిమ్మరసం వేసి రెండు నిమిషాల పాటు ఉంచి దించేయాలి. ఇప్పుడు ద్రాక్షపండ్లు, కిస్‌మిస్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేడి.. వేడి.. అంగూరీ ముర్గ్ తింటే.. ఆహా.. ఏమిరుచి అనక మానరు!
బొమ్మిడాయల పులుసు
కావలసిన పదార్థాలు:
బొమ్మిడాయలు - 20ఱగా.
నూనె - 30మి.లీ.
ఇంగువ - 1 పిసరంత
ఉల్లిగడ్డలు - 2
ఆవాలు - 1 టీ స్పూన్
జీలకర్ర - అర టీ స్పూన్
మెంతులు - అర టీ స్పూన్
కరివేపాకు రెమ్మలు - 8
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
టమాటా ప్యూరీ - 750మి.లీ.
కారం - 2స్పూన్‌లు
ధనియాల పొడి - 1 స్పూన్
పసుపు - అర టీ స్పూన్
పచ్చి మామిడికాయ - సగం
మామిడికాయ పచ్చడి - రెండు స్పూన్లు
చింత పండు రసం - 100మి.లీ.
చక్కెర - ఒక స్పూన్
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
కడాయిలో నూనెపోసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించాలి. దీంట్లో కరివేపాకు, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, పసుపు, ధనియాలపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. నూనె తేలే వరకు ఉంచి అప్పుడు చింతపండు రసం పోసి మరగనివ్వాలి. దాంట్లో పచ్చిమామిడి కాయ ముక్కలు, పచ్చడి గ్రేవీ, చక్కెర, ఇంగువ వేసి బాగా కలపాలి. కాసేపు ఆగిన తర్వాత బొమ్మిడాయలు, కొత్తిమీర వేసి కలపాలి. ఐదు నుంచి పదినిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. దీన్ని వండిన రోజు కాకుండా తర్వాత రోజు సర్వ్ చేసుకుంటే రుచికరంగా ఉంటుంది
చికెన్ లచీజ్ టిక్కా
కావలసిన పదార్థాలు:
చికెన్ - 20ఱగా.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
మస్టర్డ్ ఆయిల్ - 1 స్పూన్
పచ్చిమిరపకాయల పేస్ట్ - 2 స్పూన్‌లు
గట్టి పెరుగు - 10ఱగా.
చీజ్ - 2షగా.
చాట్‌మసాలా - ళగా.
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి దాంట్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్, మస్టర్డ్ ఆయిల్, పచ్చిమిరపకాయల పేస్ట్, ఉప్పు, నీళ్లు వడకట్టిన పెరుగును వేసి బాగా కలపాలి. ఇలా 6 నుంచి 8గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత మెక్రోఓవెన్‌లో కానీ, తందూరీలో కానీ 180డిగ్రీల నుంచి 220డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బేక్ చేయాలి. బయటకు తీసి చీజ్, చాట్‌మసాలా వేసి సర్వ్ చేయాలి. నోరూరించే.. చికెన్ లచీజ్ టిక్కా రెడీ!
నవాబీ మటన్ బిర్యానీ
కావలసిన పదార్థాలు:
మటన్ - 50ఱగా.
బాస్మతీ రైస్ - 30ఱగా.
పిస్తా - 2ఱగా.
కాజు - 2ఱగా.
బాదం - 2ఱగా.
కిస్‌మిస్ - 1షగా.
క్రీమ్ - 3ఱగా.
నెయ్యి - 5ఱగా.
నూనె - 3ఱగా.
వేయించిన ఉల్లిపాయలు - రెండు స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
యెల్లో చిల్లీ పౌడర్ - రెండు స్పూన్లు
కారం - అర టీ స్పూన్
పచ్చిమిర్చి ముద్ద - ఒక స్పూన్
ధనియాల పొడి - అర టీ స్పూన్
జీలకర్ర పొడి - ఒక స్పూన్
ఇలాయిచీ పౌడర్ - అర టీ స్పూన్
ఉప్పు - తగినంత
కెవడా వాటర్ - 5మి.లీ.
రోజ్ వాటర్ - 5మి.లీ.
గరం మసాలా - అర టీ స్పూన్
ఇలాయిచీలు - 5
లవంగాలు - 5
స్ట్రార్‌పూన్ - 5
షాజీర - ఒక స్పూన్
బిర్యానీ ఆకులు - 2
పాలు - 30మి.లీ.
పెరుగు - 2ఱగా.
మిలన్ సీడ్స్ - 2ఱగా.
పచ్చికోవా - 5ఱగా.
కుంకుమపువ్వు- చిటికెడు
తయారు చేసే విధానం: కడాయిలో నూనె పోసి అల్లం, వెల్లులి పేస్ట్, పచ్చిమిర్చి ముద్ద వేసి వేగిన తర్వాత మటన్ ముక్కలను వేయాలి. ఇవి పావు వంతు ఉడికిన తర్వాత ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, ఉప్పు, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. రెండు నిమిషాల తర్వా త పెరుగు వేయాలి. కాజు, పిస్తా, బాదం, మిలన్ సీడ్స్‌ని పేస్ట్‌లా చేసుకొని దాన్ని ఈ కూరలో వేయాలి. ఇప్పుడు క్రీం, పాలు, పచ్చికోవా, కుంకుమ పువ్వు వేసి కాసేపు ఉడకనివ్వాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి లవంగాలు, ఇలాయిచీలు, స్ట్రార్‌పూన్, బిర్యానీ ఆకులు, ఉప్పు వేసి కాసేపు మరగనివ్వాలి. దాంట్లో బాస్మతీ రైస్ వేసి ఉడకనివ్వాలి. సగం ఉడికిన తర్వాత దించేయాలి.
ఇప్పుడు మరో గిన్నె పెట్టుకొని కొద్దిగా మటన్ కర్రీ వేసి అందులో కెవడా వాటర్, రోజ్‌వాటర్, క్రీమ్, పాలు వేసి ఆ తర్వాత అన్నం వేయాలి. మళ్లీ కాసేపటి తర్వాత వేయించుకున్న ఉల్లిపాయలు, యెల్లో చిల్లీ పౌడర్, ఇలాయిచీ పౌడర్, నెయ్యి వేసి అన్నం, కూర మళ్లీ లేయర్‌లుగా వేస్తూ పోవాలి. ఇలా వేసిన తర్వాత వేరే స్టౌ మీద తవ్వను పెట్టి ఈ గిన్నెను దాని మీద పెట్టాలి. దీని ఆవిరి పోకుండా మూతను గట్టిగా గోధుమపిండితో మూసేయాలి. ఆవిరి బయటకు వచ్చేవరకు ఉడకనివ్వాలి. అంతే.. రుచికరమైన నవాబీ మటన్ బిర్యానీ మీ ముందుంటుంది.
Other News