ఉప్మా స్పెషలిస్ట్
నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒకసారి మా ఫ్రెంఢ్ ఇంటికి వెళ్లాను. వాళ్ల ఇంట్లో ఎవరు లేరు. మా ఫ్రెండ్ నాకు వంట వచ్చేమో అనుకొని ‘ఆకలేస్తోందిరా.. ఏదైనా వండిపెట్టు’ అన్నాడు. అప్పటి వరకు నేను ఏనాడూ వంట చేయలేదు. ఎలాగైనా ఫ్రెండ్ ముందు బిల్డప్ ఇవ్వాలని అనుకున్నాను. ఇంట్లో వాళ్లు ఉప్మా చేస్తుంటే చూసిన జ్ఞాపకం ఉంది. దాంతో ఉప్మా చేయాలని డిసైడ్ అయ్యాను. వంటింట్లోకి వెళ్లి కష్టపడి ఉప్మా చేశాను. వండిన విజయానందంలో వాడిని పిలిచాను. నేను తయారు చేసిన ఉప్మాని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. ఏమయింది? అంటే చెప్పడు. ఇంతలో వాడి తమ్ముడు కూడా వచ్చాడు. అతని చెవిలో ఏదో చెప్పాడు మా ఫ్రెండ్. ఇద్దరూ కలిసి అదే పనిగా నవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత.. అసలు విషయం చెప్పేసరికి నాకూ నవ్వాగలేదు. ఎందుకంటే.. నేను ఉప్మా చేసింది ఇడ్లీ రవ్వతో. నిజానికి నాకు ఇప్పటికీ ఆ రెండు రవ్వలకు తేడా తెలియదు. ఈ విషయాన్ని కాలేజీలో కూడా టాం.. టాం.. చేశాడు. లెక్చరర్లతో సహా నా ప్రతిభ చూసి నవ్వుకున్నారు. ఇలా నేను ‘ఉప్మా స్పెషలిస్ట్’అయ్యాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఉప్మా తిన్నా ఆ సన్నివేశం గుర్తుకు వచ్చి నవ్వుకుంటాను.
Other News