మీ వంట
మిల్క్ కోవా రబ్రీ
కావలసిన పదార్థాలు:
చిక్కటి పాలు - ఒక లీటరు
కోవా - ముప్పావు కప్పు
చక్కెర - నాలుగు టీ స్పూన్లు
పిస్తా - 8
యాలకుల పొడి - అర టీ స్పూన్
గులాబీ రేకులు - కొన్ని
రెడీమేడ్ అల్లం మురబ్బా - ఆరు
కడాయిలో పాలను మరిగించి అందులో మెత్తగా చిదిమిన కోవా, చక్కెర వేసి బాగా కలపాలి. తక్కువ మంట మీద 45నిమిషాల పాటు ఉంచాలి. పాలు సగమై చిక్కగా మారి అంచులకు అంటుకుంటుండగా స్టవ్ మీద నుంచి దించేయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసిన పిస్తాపప్పు, యాలకుల పొడి వేసి కలపాలి. అల్లం మురబ్బాను చిన్న, చిన్న ముక్కలుగా కోసి ఈ మిశ్రమంలో వేయాలి. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తీసి గులాబీరేకులతో అలంకరించి అతిథులకు అందించాలి. తియ్యటి, చల్లటి మిల్క్ కోవా రబ్రీ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
Other News