|
|
Home >> Zindagi >> Josh 4 Uth
పసుపు లేని కూర
నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ఓ సారి ఇంట్లో అందరూ ఏదో పనిమీద బయటికి వెళ్లారు. అన్నం ఉంది కానీ కూరలేదు. నాకేమో ఆకలి. ఏం చేయాలి? అని ఆలోచించి... నాకిష్టమైన టమాట కూర చేద్దామని మొదలుపెట్టాను. వంట చేయడం మొదటిసారి కావడంతో టెన్షన్ టెన్షన్. స్టౌవ్ వెలిగించి గిన్నెపెట్టి ఆయిల్ పోశాను. నూనె వేడికాగానే పోపు గింజలు వేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేశాను. తరువాత టమాట ముక్కలు వేసి ఉడికాక... కాస్త ఉప్పు, కారం వేసి దించేశాను. ఆకలితో ఉన్నాను కాబట్టి రుచితో సంబంధం లేకుండా బాగానే తిన్నాను. కాకపోతే కూర తెల్లగా ఉంది. ఏం తక్కువైందో నాకు అర్థం కాలేదు. తరువాత అమ్మ వచ్చి కూర చూసి ‘‘పసుపు వేయకుండా కూరచేస్తే తెల్లగానే ఉంటుంది’’ అని ఒక్క మాటలో తేల్చేసింది. ఇప్పటికీ నా మొదటి వంట గురించి గుర్తుచేసి అందరూ నన్ను వెక్కిరిస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం అద్భుతంగా చేస్తాను.
- మాదారపు రాధిక, కరీంనగర్, జగిత్యాల గమనిక ఇలాగే నవ్వు తెప్పించేదైనా, సీరియస్‌గా ఉన్నా, సూపర్‌గా ఉండీ అందరూ మెచ్చుకున్నదైనా ... మీ తొలివంట ఎక్స్‌పీరియన్స్ మాకు రాసిపంపించండి. చిన్నా, పెద్దా, ఆడా, మగా, ఎవ్వరైనా... మీ కుకింగ్ జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోవచ్చు! మా చిరునామా మా అడ్రస్ : జిందగీ (తొలితాలింపు), నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, బంజారాహిల్స్, రోడ్ నెం. 10, హైదరాబాద్- 500 034.
Other News
|
|