|
|
Home >> Zindagi >> Mulakhath
ఒక యాది పాటల రచయిత చంద్రబోస్ హైస్కూల్లో ఉన్నప్పుడే ‘నవత’, ‘వార్తావాహిని’ అని రెండు వార్తాపవూతికల్ని నడిపాడు. వాళ్ల ఊళ్లోని సంఘటనల తాలూకు వార్తలు స్వయంగా రాసి ఆ పేపర్లను ఊరిలోని లైబ్రరీలో పెట్టేవాడట. ఊరికి సంబంధించిన వార్తలు కావడం వల్ల ఆ లిఖిత పత్రికలు చదవడానికి చాలామంది ఆసక్తి చూపించేవారట. ఆ వార్తలన్నీ అమ్మానాన్నలు మాట్లాడుకుంటుండగా విన్నవి కొన్ని, అన్నయ్యవాళ్ల బ్యాచ్ అనుకుంటుండగా గమనించినవి కొన్ని..కష్టపడి తిరిగి సేకరించినవి కొన్ని! ఆ పత్రికలు చంద్రబోస్‌కు ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి ఊళ్లో. తరువాత కాలంలో పై చదువుల కోసం వాటిని ఆపేయాల్సి వచ్చింది. అయినా ఆ రెండు పత్రికలు ఎప్పటికీ మరిచిపోని యాదిని మిగిల్చాయట చంద్రబోస్‌కు.
Other News
|
|||||