ఒక యాది
సినిమా కథల ఎంపికలో సీనియర్ దర్శకుడు బి. భాస్కర్‌రావుది ఒక డిఫంట్ స్టైల్. ఆయన కథల పట్ల ఎంత కసిగా ఉండేవారో ‘సీన్ల’ విషయంలో కూడా అంతే కేరింగ్‌గా ఉండేవారు. సాధారణంగా ఒక దర్శకుడు తనకు నచ్చిన సీన్‌ని మార్చడానికి ఒప్పుకోడు. కానీ భాస్కర్‌రావు.. తన సీన్ కంటే అసిస్టెంట్లు చెప్పిన సీన్ బాగుందనిపిస్తే దాన్నే ఫైనల్ చేసేవారు. అంటే తన కిందివారికి కూడా అంత ప్రయారిటీ ఇచ్చేవారు. ఇందుకు రెండు ఉదాహరణలు. ‘శ్రీవారు’ సినిమాలో విజయశాంతి, శోభన్‌బాబు విడిపోతారు. వారి కొడుకు తల్లికి తెలియకుండా అప్పుడప్పుడు తండ్రి(శోభన్‌బాబు)ని కలుస్తున్నట్లు విజయశాంతికి తెలుస్తుంది. అప్పుడామె కోపంతో కొడుకుని కొడుతుంది. ఇద్దరూ ఏడుస్తారు. కాసేపయ్యాక విజయశాంతి కళ్లు తుడుచుకుని ప్లేటులో అన్నం పెట్టుకుని వచ్చి కొడుక్కి తినిపించాలి.
ఇదీ సీన్. కానీ ఆయన అసిస్టెంట్లలో ఒకరైన పార్థసారధికి ఇది నచ్చలేదు. ‘సార్! ఈ సీన్‌లో తల్లి అన్నం తినిపించకుండా కొడుకే వచ్చి తినిపించేలా పెడదాం బావుంటుంది’ అన్నాడు. అప్పుడు భాస్కర్ రావు కాసేపు ఆలోచించి ‘బావుందిరా అలా అయితే సీన్ ఇంకా బాగా పండుతుంది’ అని ఆ సీన్‌నే ఫైనల్ చేశాడు. ఇంకోసీన్.. ఉమ్మడి మొగుడు సినిమాలో శోభన్‌బాబు భార్య చనిపోతుంది. చంద్రమోహన్, శోభన్‌బాబు కారులో వెళ్తుంటారు. శోభన్‌బాబు కారు వైపర్లు ఆన్ చేస్తాడు. ‘అదేంటి? వైపర్లు ఎందుకేశావ్?’ అని చంద్రమోహన్ అడుగుతాడు. ‘బయట వర్షం పడుతుంది కదా’ అంటాడు. ‘వర్షం కాదు.. నీ కళ్లలో నీళ్లు తుడుచుకో’ అని చెప్తాడు చంద్రమోహన్. ఇది అసిస్టెంట్ చెప్పిన ఇంటపూక్చువల్ ఎక్స్‌టెన్షన్ సీన్. శోభన్‌బాబు కారు నడుపుతూ ఏడుస్తుంటాడు. చంద్రమోహన్ కళ్లు తుడుచుకొమ్మంటాడు. ఇది అంతకు ముందు ఉన్న సింపుల్ సీన్.
Other News