ఒక యాది
ఎన్టీయార్‌తో తెలుగుదేశం లీడర్ దేవేందర్‌గౌడ్‌ది ప్రత్యేక అనుబంధం. టీడీపీ ప్రభుత్వం లేని టైమ్‌లో కూడా జెడ్పీ చైర్మన్‌గా దేవేందర్‌గౌడ్ అధికారంలో ఉన్న సమయం అది. అప్పట్లో ఎన్టీయార్ సినిమా షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు (రీ ఎంట్రీలో) ఎప్పుడూ దేవేందర్‌గౌడ్‌ను పక్కనే ఉంచుకునేవాడట పెద్దాయన. అలా ఆయనతో ప్రత్యేక బంధం ఏర్పడింది. వాళ్ల అనుబంధంలో మరిచిపోలేని అనేక సంఘటనలు ఉన్నా... ‘ఎర్లీమార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్’ సంగతి మాత్రం తరచుగా గుర్తుచేసుకుంటాడు దేవేందర్‌గౌడ్. ఏదో సందర్భంలో ఎన్టీయార్‌తో తిరుపతి వెళ్లినప్పుడు ఓ రోజు ఉదయం ఐదు గంటలకే పెద్దాయన నుంచి పిలుపొచ్చింది. అప్పటికి దేవేందర్‌గౌడ్ బ్రష్ చేసుకుని ఉన్నాడంతే. ఇంత పొద్దున్నే ఎందుకు పిలిచాడబ్బా... అనుకుంటూ హడావిడిగా వెళ్లాడు. ‘రండి బ్రదర్. బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం’ అని డైనింగ్ చూపించాడట ఎన్టీయార్. దాంతో షాక్ తిన్న దేవేందర్‌గౌడ్ తేరుకోకముందే ‘స్నానం చేశారా బ్రదర్’ అని మరో ప్రశ్న సంధించాడు. ‘ఐపోయింది సార్’ అని అబద్దం చెప్పి మరీ గౌరవంగా ఆయనతో బ్రేక్‌ఫాస్ట్ చేసి వచ్చాడట దేవేందర్‌గౌడ్.
Other News