ఊరెళ్లి పోతున్నది....

కళ్లూరి వెంకవూటావ్...తన ఊరి ప్రజలకు నమ్మదగిన నాయకుడు తాను ముందుండి ప్రజలను నడిపించిన నిజమైన నేత ఒకప్పుడు తన చేతుల్తో ఒక ఊరినే నిర్మించిన మాస్ లీడర్ కానీ ఇప్పుడు తాను పుట్టించిన ఊరు రిజర్వాయర్‌లో కలిసిపోతుంటే అచేతనంగా చూస్తున్న ఒక నిస్సహాయుడు...రోడ్డున పడుతున్న జీవితాల్ని చూస్తూ మౌనంగా రోదిస్తున్న సగటు మనిషి....కళ్లూరి వెంకవూటావ్ అంటే ఊళ్లో మాంచి పరపతి ఉన్న మనిషి. అప్పట్లో దొరల కుటుంబం ఎలా బతికేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి కుటుంబంలో పుట్టిన వెంకవూటావ్ మాత్రం దొర’లా బతకలేదు. నిజమైన నాయకుడిలా బతికాడు. 1962లో కమ్యూనిస్టు పార్టీతో పరిచయం ఏర్పడిన ఆయన అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీ అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు. ఆయనలోని చురుకుదనం, తెలివితేటలు అతన్ని పార్టీకి మరింత దగ్గర చేశాయి. కొద్దిరోజుల్లోనే వెంకవూటావ్ చేతుల్లో పెద్ద బాధ్యత పడింది. అది తన స్వగ్రామం మేడపెల్లి చుట్టుపక్కల ఉన్న భూమిపై పోరాటం చేయడం. ఆ భూమిని అందరికీ పంచడం! వెంకవూటావ్‌కు చదువు లేదు. అనుభవం చిన్నది. సమస్య పెద్దది. అయినా ఓకే అనుకున్నాడు.అక్కడ్నుంచి ఆయన కసరత్తులు, ఎత్తుకు పై ఎత్తులు మొదలైనయ్. బాగా ఆలోచించాడు. ఈ భూ పోరాటంలో ఎవరికి ఎంత స్వార్థం ఉందని! పోరాటం పార్టీదే అయినా ఫలితం అందరికీ చెందుతుంది. వెంకవూటావ్ ఆస్థిపరుడే. ఆయనకు భూమి అవసరం లేదు కానీ భూమిలేని ఎంతో మంది ఉన్నారు తన చుట్టూ. కాబట్టి పోరాటం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకుముందు కూడా ఆ భూమిపై రెండు కుటుంబాలు పోరాటం చేసి అలిసిపోయి ఉన్నాయి. ఈ సారి బాధ్యత వెంకవూటావ్ చేతిలోకి వచ్చింది. ఎలాగైనా గెలిచి చూపించాలనుకున్నాడు.
అతడొక జన సమూహం
ఆయన ఆశయం ఒక్కటే.... పార్టీ అప్పగించిన పనిని చేసి చూపడం.తనకున్న పరపతితో, ప్రజలతో ఉన్న అనుబంధం వల్ల మెల్లగా జనాన్ని సమీకరించాడు. కులాల వారీగా జనసమీకరణ చేయడం వల్ల ఆయన పని ఈజీ అయ్యింది. అతి తక్కువ సమయంలో తన వెనక వందల మంది చేరిపోయారు. జనం ఉన్నారు. ఇక ప్రభంజనం సృష్టించడమే మిగిలింది. తన జనానికి ఏం చేయాలో చెప్పాడు. ‘ఈ భూమి మనది’ అని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. అయితే అప్పటికి అదంతా అడవి! దాన్ని భూమిగా మార్చాలంటే ముందు ఆ అడవంతా నరకాలి...ఆలోచించలేదు నరకడం మొదలు పెట్టారు. అది కూడా గుట్టుగా. రాత్రుళ్లు వెళ్లి అడవిని నరికేవాళ్లు. అలా మూడు రోజులు జరిగింది. విషయం ఫారెస్ట్‌వాళ్లకు తెలిసింది. ఊరుకుంటారా? ఆరా తీశారు.... నాయకుడు వెంకవూటావ్ అని తెలిసింది. ఫారెస్ట్ వాళ్లతోఆయనకి వాగ్వాదం జరిగింది. ‘భూమి మాది’ అన్నాడు వెంకవూటావ్. వాళ్లు కాదన్నారు. ఆయన అలాగే నిలబడ్డాడు. తన వెనక జనం కూడా అక్కణ్ణుంచి కదల్లేదు. విషయం ఫారెస్ట్ అధికార పెద్దలకు చేరింది. ఎలాగైనా అడవి నరికివేతను నిలువరించాలనుకున్నారు. పెద్ద ఎత్తున ఉపాయాలు చేశారు కానీ వెంకవూటావ్ ఒక్కడు కాదు..... అతడొక జన సమూహం!
ఈసారి ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ప్లాన్ మార్చి ఓ రోజు ఒంటరిగా కనిపించిన వెంకవూటావ్‌ను బుజ్జగించి మరీ జీపు ఎక్కించుకుని వెళ్లారు. మహబూబాబాద్‌కు తీసుకెళ్లి, పోరాటం విరమించుకోమని ఒక రోజంతా కొట్టారు. విపరీతంగా కొట్టారు. ఎంతగా అంటే ఆ దెబ్బలకు ఆయన చెవులు పనిచేయకుండాపోయాయి. పది ఎకరాల భూమి, యాభై వేల చెక్కు ఇస్తాం ఇవన్నీ మానుకో అన్నారు. శరీరం కంటే అయన మనసు ఇంకా బలమైనది అందుకే ఎక్కడా లొంగలేదు. సంవత్సరం పాటు పోలీసులతో, ఫారెస్ట్ వాళ్లతో ఎప్పుడూ గొడవలే. ఈ క్రమంలో వెంకవూటావ్ జనానికి మరింత దగ్గరయ్యాడు. ఇక్కడ జరుగుతున్న రభస చూసి కొన్నాళ్లకు పార్టీ వాళ్లు కూడా ‘వదిపూయ్ వెంకవూటావ్’ అని ఉచిత సలహా ఇచ్చారు కానీ, ఆయన వదల్లేదు.‘ఇప్పటిదాకా పార్టీ కోసం చేశాను. ఇప్పటి నుంచి ప్రజల కోసం చేస్తా’నని తనకు తానే శపథం చేసుకున్నాడు. పోరాటం మధ్యలో ఆపి జనాల్లో చులకన అయ్యేకంటే వాళ్ల కోసం నిలబడి నాయకుడుగా ఉండటమే మంచిదనుకున్నాడు. ఆ తర్వాత లీడర్లు.. కోర్టులు.. పోలీస్ స్టేషన్లు... అధికారులు..ఆఫీసర్లను కలవడం ఆయన జీవితంలో నిత్యకృత్యమైపోయాయి. ఒకవైపు వీళ్లతో పోరాటం చేస్తూనే ఊళ్లో జనాలతో కలిసి అడవి భరతం పట్టాడు. ఆ క్రమంలో ఫారెస్ట్ వాళ్లకు ఊరి జనాలకు తరుచూ గొడవలు జరుగుతుండేవి. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకరోజు రాత్రికి రాత్రి ముప్పయ్ ఎకరాల ప్లాంటేషన్‌ను కొట్టేశారు ఊరి జనం. అంత చురుకుగా ఉండేది వాళ్లు. ఒక సంవత్సరం పాటు ఫారెస్ట్‌వాళ్లు చెట్లు పెట్టడం, వెంకవూటావ్ అండ్ పార్టీ నరికేయడం..అదో దినచర్యగా సాగింది.
పహాణి సంపాదించి...
ఈ సారి మరో అడుగు ముందుకేశాడు. నరికిన ప్రాంతమంతా రాత్రికిరాత్రే దున్నేసి పెసల్లు వేయించాడు అందరి చేత. మూడో రోజు మొలకెత్తింది. ఆయనలో కొత్త ఆలోచన రేకెత్తింది. నేరుగా వెళ్లి అప్పటి ఎమ్మార్వోను కలిశాడు. పరిస్థితి వివరించాడు. జరుగుతున్న గొడవలు, భూమి అవసరం...అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ భూమి మీద బతికే జీవితాలను చూపించాడు. ఆ ఎమ్మార్వో సర్వే నెంబర్ 1 మీద 360 ఎకరాలు, సర్వే నెంబర్2 మీద 160 ఎకరాలు, సర్వే నెంబర్ 3 మీద 17 ఎకరాలకు పహాణి నకలు రాసిచ్చాడు. ఆ భూమి మొత్తం పంచితే మనిషికి రెండు ఎకరాలు వస్తుంది. వెంకవూటావ్‌లో ఏదో సాధించిన ఫీలింగ్! కానీ చేతికందలేదనే అనుమానం!! అందుకే ఇంకా ఏదో చేయాలనుకున్నాడు. ఆ పహాణీ నకల్‌తో హైకోర్టులో పిటిషన్ వేశాడు.పైరు ఉంటేనే పట్టాలివ్వాలని కోర్టు తీర్పు. సగం పనైపోయినట్టే అనిపించింది. మళ్లీ దున్నుడు మొదలుపెట్టారు. 20 ఎకరాలు పెద్దజొన్నలు, 40 ఎకరాలు చిన్నజొన్నలు, 10 ఎకరాలు దుక్కి...ఈ రూపంలోకి మార్చేశారు అప్పటి వరకు చదును చేసిన భూమిని. ఆ తరువాత రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వచ్చి 70 ఎకరాలకు పంచనామా రాసి ఇచ్చింది. తరువాత జరిగిన గొడవల వల్ల నాలుగేళ్లు ఆ భూమి ‘సస్పెన్స్’ కేటగిరీలోనే ఉండిపోయింది. చేతిలోకి వచ్చినట్టే ఉంది కానీ, ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈసారి సరైన నిర్ణయం తీసుకున్నాడు.ఆ భూమిలో గుడిసెలు వెలిసేలా చేశాడు. అక్షరాలా 216 గుడిసెలు ఏర్పడ్డాయి అక్కడ. గుడిసెకో ఉట్టి, పొయ్యి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఊరన్నాక బావి ఉండాలి కదా అని, అంతా కలిసి అర్జంటుగా బావి తవ్వుకున్నారు. గ్రామ పంచాయితీకి వెళ్లి 116 గుడిసెలకు ఇంటి పన్ను చెల్లించి (అప్పుడు రూ. 6-15 పైసలు) రశీదులు రాయించాడు వెంకవూటావ్. ఆ ఆధారాలతో మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. కేసు ఇంకా అలాగే ఉంది. కానీ, అక్కడ ఆసర అని ఒక గ్రామం నిర్మాణమైంది. దాన్ని ఆనుకుని తండాలు ఏర్పడ్డాయి. పంటపొలాలు.
ఇళ్లడుగు స్థలాలతో మెల్లగా ఒక ఊరు మొలిచింది అక్కడ. అది చూసి మురిసిపోలేదు వెంకవూటావ్.. ఆ ఊరిని ప్రభుత్వం దృష్టిలో పడేయాలని ‘ఉచిత కుటుంబ నియంవూతణ ఆపరేషన్ క్యాంప్’లు పెట్టించాడు. జనాభా లెక్కలు రాసేవాళ్లను ప్రత్యేకంగా ఆ ఊరికి తీసుకొచ్చి ఆసర అనే ఒకక్షిగామం ఉందని సాక్ష్యాధారాలు చూపించాడు. ఊళ్లో బొడ్రాయి పాతి దసరా పండగలను అక్కడే జరిపింవాడు.కాలం గడిచిపోతుంటే.....ఆ ఊరికి కరెంట్ వచ్చింది. బస్ వచ్చింది. స్కూల్ వచ్చింది. రోడ్లు వచ్చినయ్. వెంకవూటావ్ మాత్రం ఆ ఊరొదిలి హైద్రాబాద్‌కు వచ్చాడు. ఈ పోరాటంలో ఆయన తన ఫ్యామిలీని పట్టించుకోలేదు. కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరగడానికి అప్పులు చేశాడు. ఆ అప్పు తీర్చడానికి తన వంతుగా వచ్చిన భూమిని అమ్ముకున్నాడు.ఆ సమయంలో తన కొడుకు మధుసూదన్ పట్నంలో ఉంటున్నాడు. ఊళ్లో పరిస్థితులు బాగలేక అక్కణ్ణుంచి హైద్రాబాద్ వచ్చింది వెంకవూటావ్ కుటుంబం. ఊరు వెంకవూటావ్‌ను మరిచిపోలేదు. వెంకవూటావ్ ఊరును మరిచిపోలేదు. తాను ఊరిడిచి వెళ్లాడు ఒకప్పుడు... కానీ ఇప్పుడు ఊరే తనని ఒంటరిని చేసి వెళ్తోంది!!

ఇరవై ఏళ్లు పోరాడాను
నల్లబెల్లి మండలంలో 17 వ గ్రామం ఆసర అది నిర్జన గ్రామంగా రికార్డుల్లో ఉంది. ఎన్టీయార్ హయాంలో మండలాల ఏర్పాటు తర్వాత రికార్డు అయిన ఆ విషయం తెలుసుకున్న తర్వాతే నా పోరాటాన్ని ఉధృతం చేశాను. నిజానికి 1962 వరకు అదొక గ్రామమే. ఆ తరువాతే ఫారెస్ట్ వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. 1964లో మొదలైన నా పోరాటం 1984 వరకు సాగింది. ఆ ఇరవై ఏళ్లల్లో ఎన్నోసార్లు రాజకీయ అవకాశాలు వచ్చినా నేను పట్టించుకోలేదు. పోరాటమే ముఖ్యమనుకున్నా. నాతో పాటు పనిచేసిన మిత్రుపూంతో మంది ఉన్నారు. అందరి సహకారంతోనే అప్పుడు పోరాటం చేశాను. ఈ కేసు విషయంలో హైకోర్టుకు వెళ్లినప్పుడు ఫుట్‌పాత్‌ల మీద పడుకున్న రోజులున్నై. చాలా కష్టపడ్డం. పట్టాలైతే దక్కలేదు కానీ, అందరికీ భూములందినై. కొన్ని జీవితాలు నిలబడినై. అయితే మళ్లీ పాత పరిస్థితులే వచ్చినై. నా ఊరి బంధం తెగిపోవడం మరిచిపోని విషాదం నాకు. ప్రభుత్వం అక్కడి ప్రజలకు పునారావాసం కల్పించాలనేదే నా డిమాండ్.
ప్రస్తుత పరిస్థితి...
ఆసర వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలంలో ఓ చిన్న గ్రామం. ఇంతకుముందు ఆ ఊరి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు జిల్లాలోని అందరిచూపు ఆ విలేజ్ పైనే. ఎందుకంటే అతి త్వరలో ఆ ఊరు మాయమైపోతున్నది. అదొక్కటే కాదు మొత్తంగా మూడు వందల ఎకరాల భూ విస్తీర్ణంలో ఉన్న లచ్చుతండా, కొండాపూర్, రాంపూర్‌లు గ్రామా లు కూడా కనుమరుగు కానున్నాయి. ఆ ప్రాంతంలో ఉండే రంగయ్య చెరువును రిజర్వాయర్‌గా మారుస్తున్నారు. ఆ చెరువుకట్టను ఇంకో రెండు కిలోమీటర్లు పెంచాలన్న పాలకుల ఆలోచన అమలవుతున్నది. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. అక్కడి ప్రజలు ఉన్నపళంగా వేరే ప్రాంతానికి వెళ్లక తప్ప విచిత్రం ఏమిటంటే....పునరావాసం అన్నమాటే వినిపించ ఈ తతంగంలో. రిజర్వాయర్ ఎక్కువ ప్రయోజనాలను అందించే మాట వాస్తవమే కానీ ఎంతోమంది పేదల జీవితాలు రోడ్డున పడటమే ఇక్కడ విషాదం. ప్రస్తుతం ఆ ఊరిపరిస్థితులు చేదాటిపోయాయి. రిజర్వాయర్ పనులు పర్యవేక్షించే అధికారులు ఊళ్లోకి వస్తే ప్రజలు, యువకులు వాళ్లపై దాడులు చేస్తున్నారు. జరిగే దారుణాన్ని ఆపేందుకు వాళ్లకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అంతేకాదు ‘ప్రత్యామ్నాయం’ చూపించే ఆలోచన చేసే నాయకుడూ కనిపించడం లేదు. ఆసర అంటే ఈ రోజు మాయమైపోతున్న విలేజ్ మాత్రమే కాదు రేవూరి ప్రకాష్‌డ్డిని తొలిసారిగా శాసన సభలోకి పంపింది కూడా ఈ ఊరే. ఓటమికి దగ్గర్లో ఉన్న ఆయన్ని గెలిపించింది ఈ ఊరు ఓట్లే. ఆ నమ్మకంతోనే కావచ్చు ఆయన ప్రచారం కూడా ఆసర నుంచే ప్రారంభించాడు. కానీ ఇప్పుడు ఆ నాయకుడు కూడా మౌనంగా ఉండటం ద్రోహంతో సమానంగా భావిస్తున్నారు అక్కడి ప్రజలు.
Other News