ఒక యాది
హుస్సేన్ బొమ్మల ఫ్రిజ్

ప్రఖ్యాత చిత్రకారుడు ఎమ్‌ఎఫ్ హుస్సేన్, ఉస్మానియాయూనివర్సిటీలో ఒకప్పటి ఫిలాసఫి ప్రొఫెసర్ అయిన ఆలంకుంద్ మంచి స్నేహితులు. మీరి అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు హుస్సేన్ కొడుకు. ఆలంకుంద్‌మీరి కూతురిని పెళ్లి చేసుకుని తండ్రుల స్నేహబంధాన్ని వియ్యంకుల అనుబంధంగా మార్చాడు. హుస్సేన్ హైదరాబాదుకు ఎప్పుడు వచ్చినా ఆలంకుంద్‌మీరి ఇంట్లోనే బసచేసేవాడట. ఆలం కుంద్‌మీరి ఇంట్లో అప్పట్లో ఆల్విన్ రిఫ్రిజిరేటర్ ఉండేదట. స్నేహితుడికి తన కానుకగా ఆ ఫ్రిజ్ మీద ఎమ్‌ఎఫ్ హుస్సేన్ తనకు నచ్చిన పెయింటిగ్స్‌ను వేశాడట. తర్వాత హుస్సేన్ కొడుకు, ఆలంకుంద్‌మీరి కూతురికి మధ్య పొరపొచ్చాలు వచ్చి విడిపోయారు. అయినా హుస్సేన్, ఆలంల స్నేహం మాత్రం కొనసాగింది. హుస్సేన్ పెయింటింగ్స్‌తో ముస్తాబైన ఆ ఫ్రిజ్‌ను తన స్నేహితుడి గుర్తుగా ఆలం చాన్నాళ్లు భద్రంగా దాచుకున్నారట!
Other News