డిఫంట్ ట్రెండ్
కలర్ కాంబినేషన్స్ ఏవైనా ఓకే! డిఫంట్‌గా కనిపించడమే లేటెస్ట్ స్టయిల్ అంటోంది నేటితరం. అందుకే కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ వైపే మూవ్ అవుతున్నాయి. ఈ ట్రెండ్‌కి అనుగుణంగా డిజైన్ చేసిన చుడీదార్‌లు ఇవి. కొత్త ఫ్యాషన్‌ని ఫాలో అవ్వాలనుకునే అమ్మాయిల కోసం..
వంకాయ రంగు మంగళగిరి కాటన్ వేర్ ఇది. దీని మీద బ్రొకెడ్‌తో మ్యాంగో అప్లిక్ వర్క్ చేశాం. మిగతా అంతా మెషిన్ ఎంబ్రాయిడరీతో డిజైన్‌ని కుట్టాం. నెక్‌కి, స్లీవ్స్‌కి గోల్డెన్ కలర్ షిమ్మర్ ఫ్యాబ్రిక్‌తో పైపింగ్ చేశాం. ఎంబ్రాయిడరీ మీద కూడా షిమ్మర్‌తో చిన్న పూలను కుట్టి మధ్యలో ఆకుపచ్చని చిన్న స్టోన్స్‌ని ఇచ్చాం. గ్రీన్ కలర్ లెగ్గింగ్ వేసుకోవాలి. బ్లూకలర్ బాందినీ దుపట్టా వేసుకుంటే డిఫంట్‌గా ఉంటుంది.
బ్లూ కలర్ లేస్ ఫ్యాబ్రిక్.. ఫుల్ గ్యాదర్స్‌తో డిజైన్ చేసిన టాప్ ఇది. దీనికి అప్పర్ చెస్ట్ వరకు యెల్లో కలర్ సెమీ బ్రొకెడ్‌ని కుట్టాం. ఈ టాప్ అంబ్రెల్లా మోడల్. నెక్‌కి బ్లూ కలర్ లేస్‌ని పైపింగ్ చేశాం. స్లీవ్స్‌కి కూడా లేస్ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించాం. స్లీవ్స్‌కి లైనింగ్ వేయలేదు. ఫుల్ చుడీ స్లీవ్స్ రావడంతో డ్రెస్‌కి మంచి లుక్ వచ్చింది. బాటమ్, దుపట్టా యెల్లో కలర్ వేసుకుంటే బాగుంటుంది.
- కొండా కవితాడ్డి,
ఫ్యాషన్ డిజైనర్, ఫోన్: 9394456393
Other News