రెయినీ ఫ్యాషన్

చల చల్లగా గాలి.. మెల మెల్లగా చినుకులు మొదలయ్యాయి. ఏ డ్రెస్ వేద్దామన్నా కొంచెం ఆలోచించాల్సిందే! ఏ ఫ్యాబ్రిక్, కలర్, ఏ స్టైల్‌ని ఎంచుకోవాలి? లాంటి ఆలోచనలకు గుడ్‌బై చెప్పేసి ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వండి.
కలర్: ఈ సీజన్‌లో మామూలుగా అయితే డార్క్ కలర్స్ వేసుకోవాలంటారు. ఎందుకంటే అవి వేడిని ఉత్పత్తి చేసి ఒంటికి వెచ్చగా అనిపిస్తుంది. అయితే.. లైట్ కలర్స్ ఎంచుకుంటే.. మనం బ్రైట్ లుక్‌తో కనిపిస్తాం. పర్పుల్, పింక్, పీచ్, వంకాయ రంగు, ఆకుపచ్చలో లైట్ కలర్స్ ఏవైనా బాగుంటాయి. బ్లాక్ కలర్ స్టైలిష్ లుక్‌తో పాటు, వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది.
ఫ్యాబ్రిక్: వర్షాకాలంలో.. కాటన్ వస్త్రాలులను పక్కన పెట్టేయండి. ఇవి తడిస్తే తొందరగా ఎండవు. కాబట్టి.. క్రేప్, జార్జెట్, షిఫాన్ మెటీరియల్స్‌ని వార్డ్‌రోబ్‌లో పెట్టండి. జీన్స్, 3/4 జీన్స్ కాలేజ్‌గర్ల్స్‌కి సూటబుల్.

ప్యాటర్న్: కొంచెం వెస్ట్రన్ లుక్ ఇస్తే బాగుంటుంది. దాంతో ట్రెండీ లుక్ మీ సొంతం. కలర్‌ఫుల్ టీ షర్ట్స్, చిన్న, చిన్న పూలతో టాప్స్, ఫ్లోరల్ ప్రింట్ షర్ట్స్ బాగుంటాయి. అయితే బాడీ స్ట్రక్చర్‌ని బట్టి మన స్టైలింగ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. అంటే... మనం కుట్టించేటప్పుడే మనకు సూట్ అవుతుందో, లేదో చూసుకోవాలి. దాంట్లోనే వేరియేషన్స్ చూపించాలి. ఎత్తుగా ఉన్నవాళ్లకు ఈ ప్యాటర్న్, లావుగా, పొట్టిగా ఉన్నవాళ్లకు ఇలాంటి స్టైల్స్‌నే ఎంచుకోవాలని ఏమీ ఉండదు. మనకు నచ్చిన ప్యాటర్న్ ఎంచుకోవచ్చు. షార్ట్స్ వేసుకున్నప్పుడు చిన్న జాకెట్స్, ట్రౌజర్స్ వేసుకొని డిఫంట్ టచ్ ఇవ్వాలి. అటూ వర్షం పడితే ఇబ్బంది లేకుండా, ఇటు డిఫంట్ ఫ్యాటర్న్‌లా కూడా ఉంటుంది.
యాక్ససరీస్:షూస్, ప్లాట్‌ఫామ్ హీల్స్ వేసుకోవాలి. దీనివల్ల రోడ్డు మీద ఏ ఇబ్బందీ ఉండదు. ఫంకీ జ్యువెలరీ బాగుంటుంది. పెద్ద క్యాప్స్, వులెన్ స్టోల్స్ ఈ సీజన్‌లో ట్రెండీగా అనిపిస్తాయి.
Other News