కూల్ టాప్
సింపుల్‌గా ఉండి కలర్‌ఫుల్‌గా కనిపించాలనుకునే అమ్మాయిలకు వైట్, బ్లూ కలర్స్ కరెక్ట్ ఆప్షన్స్. అటు కాలేజ్ వేర్‌కి, ఇటు ఆఫీస్‌వేర్‌కి కంఫర్ట్‌గా ఉండడమే కాదు, కూల్ లుక్‌ని తెచ్చిపెడతాయి. అలాంటి మోడల్ టాప్స్ మీ కోసం..
నీలి రంగు మంగళగిరి కాటన్‌తో డిజైన్ చేసిన టాప్ ఇది. ఈ టాప్ ఆర్మ్‌హోల్‌కి, స్లీవ్స్‌కి, నెక్‌కి డబుల్
లైన్ పింక్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో పైపింగ్ చేశాం. స్లీవ్స్, ఆర్మ్స్, నెక్ దగ్గర డార్క్ బ్లూ కలర్ బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చాం. నెక్ కింద ఒక మోటిఫ్ డిజైన్ చేశాం. బ్యాక్ కూడా ఇదే ప్యాట్రన్ ఉపయోగించాం. ఈ టాప్‌కి పింక్ కలర్ కానీ, బ్లాక్ ప్రింటింగ్ చేసిన బ్లూ కలర్ బాటమ్, దుపట్టా వేసుకుంటే బాగుంటుంది.
తెల్లని తెలుపు రింకిల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇది. నెక్ లైన్‌గా, స్లీవ్స్ మీద వెల్వెట్ బాల్స్‌గల లేస్‌ని కుట్టాం. చెస్ట్ లైన్, హెమ్ లైన్ దగ్గర డబుల్ లైన్ ఇచ్చాం. ఈ టాప్‌కి ఏదైనా కలర్ దుపట్టా, బాటమ్ వేస్తే బాగుంటుంది. తెలుపు రంగు బాటమ్, దుపట్టా వేస్తే సింపుల్ లుక్ మీ సొంతమవుతుంది.
Other News