మనసు కథ
సుధీర్ ఒంటరిగా నడిచి వెళ్తున్నాడు.
పాటలు పాడుతూ, ఊగుతూ, ఉరుకుతూ హ్యాపీగా నడుస్తున్నాడు.
అతడు లక్షాధికారి. అయినా మోటర్‌బైక్ లేదు. కాదు వాడుకోవ కాలేజ్ పక్కనే కదా ‘అవసరమా?’ అనుకున్నాడు.
అతని ఇంట్లో అందరికీ అన్నీ ఉన్నాయి. సుధీర్‌కూ అన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ల నాన్న సుధీర్ కోసమే తెప్పించినా వాటిని ఏనాడు పట్టించుకోలేదు. ఏ పుస్తకంలో చదివాడో, ఏ సినిమాలో చూశాడో, ఎవరు చెప్తుంటే విన్నాడో తెలియదు కానీ ‘ఆడంబరం’ అనే మాటను అతడు సహించటం లేదు. అతని సింప్లిసిటీని అందరూ అప్రిషియేట్ చేశారు కూడా. ఈ మధ్య అతనిలో చాలా మార్పు వచ్చింది. ఒంటరిగా గడపడానికే ఇష్టపడుతున్నాడు. ఒంటరిగా ఉండటానికే ఆసక్తి చూపిస్తున్నాడు. ఎక్కువ ప్రైవసీని కోరుకుంటున్నాడు. ‘ఎవరినీ బాధపెట్టను, ఎవరి వల్లా బాధపడను’ అంటూ తన ఒంటరితనాన్ని సమర్థించుకుంటున్నాడు. ‘ఒంటరిగా ఉండటమేంటీ? కనీసం స్నేహితులతోనైనా కలిసి ఉండాలిగా అనేది వాళ్లింట్లో అందరి అభివూపాయం.
కొన్నిరోజుల తరువాత...
‘ఓయ్. మాట్లాడుతుంటే పట్టించుకోవు. తెల్లగా ఉంటానని పొగరా?’ సుభద్ర అడుగుతోంది సుధీర్‌ని.
అతడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు. సుభద్ర కొన్నాళ్ల నుంచి సుధీర్‌ను ప్రేమిస్తున్నది. అతనితో ఆ మాట చెప్పింది కూడా. కానీ సుధీర్ పట్టించుకోవ ఈ రోజు అతడిని వదిలిపెట్టకూడదనుకుంది.
అతణ్ని సమీపించి ‘సుధీర్... నువు లేకుండా నేను బతకలేను. ప్లీజ్! నా ప్రేమను ఎందుకు కాదనుకుంటున్నవ్’ అని అడిగింది బాధగా!
‘ఒంటరిగా బతకడమే నాకిష్టం. అందుకే ఏ తోడూ కోరుకోవడం లేదు నేను’ అన్నాడు.
‘జీవితాంతం ఒంటరిగా బతుకుతావా?’ అడిగింది సుభద్ర.
‘యస్. అయినా నాకన్నీ ఉన్నాయ్. కాబట్టి ఒంటరిగా బతగ్గలను’ అన్నాడు కాన్ఫిడెంట్‌గా!
అతడి మాటల్లో కచ్చితత్వం అర్థమైంది సుభవూదకు. అక్కణ్ణుంచి వెళ్లిపోబోతూ.. చివరిగా ఒక్కమాట చెప్పింది...
‘జీవితం ఎప్పుడూ ఒకలా ఉండదు. నువ్వూహించని మలుపులు ఉంటాయి. నువు గెలిచినప్పుడు నిన్ను నువ్వే ప్రేమగా హత్తుకునే వీలుండదు. నువు ఓడిపోయినప్పుడు ఓదార్పు కోసం నీ భుజంపైనే నీ తలవాల్చే అవకాశం ఉండదు. అప్పుడు తెలుస్తుంది జీవితానికి తోడు ఎంత అవసరమో’ అని!
Other News