మనసు కథ
మాధవి గొంతు తడారిపోతున్నది. ఆమె కళ్లు నీరసంగా ఉన్నాయి. ఆస్పత్రి బెడ్‌పై ఉందామె. చుట్టూ చుట్టాలంతా ఉన్నారు. అయినా ఆమె కళ్లు తన బాబాయ్ కోసం వెతుకుతున్నాయి. అందరూ ఆమెను ఓదారుస్తున్నారు. మాధవి మాత్రం ‘బాబాయ్ వచ్చాడా?’ అని నిమిషానికోసారి అడుగుతున్నది. ‘వస్తున్నాడు. దారిలో ఉన్నాడని’ చెప్తున్నారు బంధువులంతా. గంట తరువాత వచ్చాడు మాధవి వాళ్ల బాబాయ్.
అతన్ని చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు. అతడి పరిస్థితీ అంతే!
పసిగుడ్డుగా తన చేతుల్లోకి వచ్చిన మాధవిని సొంతబిడ్డలా పెంచాడు.
పుట్టగానే తల్లిదంవూడులను పోగొట్టుకోవడం ఆమె దురదృష్టమే కానీ బాబాయ్ చేరదీయడం ఆమెకు అదృష్టంలా మారింది.
ఎందుకో తెలియదు. మాధవి తన జీవితంలోకి వచ్చాక ఆమే ప్రపంచం అయ్యింది. ఆమె ఆలనాపాలనా చూస్తూ మాధవే లోకంగా బతికాడు. ఆ సంతోషం, భాద్యతల మధ్య తాను పెళ్లి కూడా చేసుకోలేదు.
మాధవికి పెళ్లైంది ఇద్దరు పిల్లలు ఇప్పుడు. అమెరికాలో నివాసం ఉంటున్న మాధవి అండ్ ఫ్యామిలీ క్రమంగా బాబాయ్‌కు దూరమైంది. ప్రేమలు అలాగే ఉన్నాయి కానీ మనుషుల మధ్య దూరం పెరిగింది అంతే! ఈ మధ్యే ఇండియాకి వచ్చింది తన పిల్లల్ని వెంటబెట్టుకుని. బాబాయ్‌తో హాయిగా పదిరోజులు గడిచిపోయాయి. పదకొండు రోజు బజారుకెళ్లినప్పుడు ఆమెకు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు బాబాయ్ ఊళ్లో లేడు. విషయం తెలిశాక పరుగు పరుగున వచ్చాడు.
ఇప్పుడు ఆస్పవూతిలో మాధవి పక్కన కూర్చుని ఉన్నాడు.
ఆమె బాబాయి చేయి పట్టుకుంది. హాయిగా నవ్వింది. ఆమె కళ్లల్లో సంతోషం. తెలియని ధైర్యం!
అందరూ ఆమెనే చూస్తున్నారు.
‘పసిగుడ్డుగా బాబాయ్ చేతుల్లో పడ్డాను. చిన్నప్పటి నుంచి ఈ చేయిపట్టుకుని బతికాను. ఈ చేతి ముద్దలే తిన్నాను. నా తప్పుఒప్పుల్ని సరిచేసింది, నా జీవితాన్ని నడిపించిందీ ఈ చేయే. ఒకవేళ నేను చనిపోతే నా కళ్లు మూయాల్సింది కూడా ఈ చేయే’ అని మాధవి చెప్తుంటే.... కన్నీళ్లతో డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు బాబాయ్.
Other News