Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> Zindagi >> Aada Bidda


24 క్యారెట్ సుహానీ

13suhani-pittie8సుహానీకి అప్పుడు ఏడేళ్లు.. ఒక పుస్తకంలో అందమైన ఆభరణాన్ని చూసింది. పసుపురంగు రత్నాలతో పొదిగిన ఆభరణం అది. ఆమె మనసులో అదలా నాటుకుపోయింది. అలాంటి నగల్ని తానూ రూపొందించాలని కలలు కన్నది. అందుకే అమెరికాలోని జెమోలాజికల్ ఇనిస్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. తర్వాత కలకత్తాలో ఇరవయ్యేళ్ల వయసులోనే సొంత ఇనిస్టిట్యూట్ నడిపించింది. 2004లో తన పేరుతో సొంత లేబుల్ ఫ్యాషన్ జ్యువెలరీని హైదరాబాద్‌లో ప్రారంభించింది.


ఆ రోజు సుహానీ చాలా బిజీగా ఉంది. ఆమె ఫోన్ రింగయ్యింది. లిఫ్ట్ చేసి ‘హలో’ అంది. ‘మీరు ప్రపంచంలోనే టాప్ టెన్ జ్యువెలరీ డిజైనర్లలో ఒకరుగా గుర్తింపు పొందారు’ అన్నాడు అవతలి వ్యక్తి. ఆమె నమ్మలేదు. ఆ తర్వాత అతనేమన్నాడో ఆమెకి ఇప్పటికీ గుర్తుంది ‘హే.. నౌ యు ఆర్ ద క్వీన్ ఆఫ్ టింబుక్టూ’ అని నవ్వాడతడు. ఎవరో తనని ఆట పట్టిస్తున్నారనుకుంది సుహానీ. ‘ఓకే నమ్మ కదా. అయితే మీకు అధికారికంగా ఈమెయిల్ పంపిస్తున్నాను చూడండి’ అని ఫోన్ పెట్టేశాడతడు. నిజంగానే మెయిల్ వచ్చింది. అది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నుంచి. జ్యువెలరీ డిజైనింగ్ క్రియేటివ్ ఫీల్డ్‌లో ఆమెకు అదో గ్రేట్ టైమ్.


సుహానీ తన చుట్టూ ఒక సర్కిల్ గీసుకుంది. దాని లోపలి అంశాల్ని, సంస్కృతిని, సంప్రదాయాల్ని బాగా అర్థం చేసుకుంది. దాని బయట ఉన్న అంశాల్ని కూడా అదే రీతిలో అర్థం చేసుకుంది. థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అంటారు కదా.. ఆమె అదే చేసింది. తన డిజైన్లు యూనిక్‌గా.. నేటివ్‌గా ఉండేలా డిజైన్ చేసుకుంది. అందుకే ఆమె అంతర్జాతీయంగా పాపులర్ అయ్యింది. ఆమె జ్యువెలరీ ఇప్పుడు న్యూ ఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు చాలా ఫేమస్. తన ఎక్స్‌క్లూజివ్ జ్యువెలరీ గురించి ఆమె ఏం చెబుతుందో వినండి.


బంగారం ‘పెట్టుబడి’గా మారిన రోజులివి. బంగారు ఆభరణాలు చాలా విలువైనవి. అలాంటప్పుడు దాని డిజైనింగ్‌కు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఒక క్లాసికల్ స్టైల్‌కే చాలామంది స్టిక్ అయిపోతుంటారు. అందుకే నేను ఫ్యాషన్ జ్యువెలరీని ఎంచుకున్నాను. దీంట్లో తీగల్ని, జిప్పర్స్‌ని, రకరకాల ర్యాండమ్ థింగ్స్‌ని ఉపయోగించే అవకాశం ఉంది. వీటితో పాటు వెండి కూడా. బంగారం కంటే తక్కువ ధరలో లభిస్తుంది... కానీ బంగారంలాగే రకరకాల టెక్చర్స్‌ని, ప్లేటింగ్స్‌ని దీంతో చేయొచ్చు.

బ్రేక్ ది రూల్
SuhaniPittఎనిమిదేళ్ల క్రితం ఆభరణాలు అంటే ఇలాగే ఉండాలని కొన్ని రూల్స్ లిమిట్స్ ఉండేవి. అంతే తప్ప ప్రత్యామ్నాయం ఉండేది కాదు. నేను అప్పుడు నా టీమ్‌తో కలిసి కొత్తరకం జ్యువెలరీని పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది ఇవేం డిజైన్లు అన్నారు. ఇది జ్యువెలరీనా అని దీర్ఘాలు తీశారు ఇంకొందరు. వారి మాటలు విని నేను ఆ రోజు ఆగిపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.. నా జ్యువెలరీని అర్థం చేసుకోవడానికి చాలాకాలమే పట్టింది. కానీ సక్సెస్ అయింది. ఎందుకంటే నా కమిట్‌మెంట్, కాన్ఫిడెన్స్ అలాంటిది.

థింక్ డిఫంట్
నేను అన్ని రకాల మెటీరియల్స్‌తో ఆభరణాలు డిజైన్ చేశాను. వెండి, రాగి, ఇత్తడి, స్టీల్, ఆక్రిలిక్, ప్లాస్టిక్.. ఇలా ప్రతిదీ. అప్పుడప్పుడూ నా వర్కర్స్ నన్ను కామెంట్ చేస్తుంటారు... ‘అన్నింటితో చేశారు ఇక కాగితంతో కూడా జ్యువెలరీ డిజైన్ చేయండి’ అని. నిజమే మంచి ఐడియా.. ఏదో ఒకరోజు దాంతో కూడా డిజైన్ చేస్తాననుకోండి. కానీ నేను చేసే ప్రతి డిజైన్‌లో ఇండియన్ సోల్ కనిపిస్తుంది. అదే నాకు ప్లస్.

ఇన్‌స్పిరేషన్
మన చుట్టూనే ఎన్నో అద్భుతమైన డిజైన్లు ఉన్నాయి. గుళ్లు, గోపురాలు, భవనాలు, కమాన్లు, అద్భుతమైన కట్టడాలు.. నిజామ్ కాలం నాటి ఫోటోలు.. ఇలా ప్రతి దాంట్లోనూ మనం గమనించాలేగానీ డీటెయిల్డ్‌గా డిజైన్లు కనిపిస్తాయి. మనం ఇండియాలో పుట్టాం.. అందమైన తాజ్‌మహల్ ఉంది... అద్భుతమైన హవా మహల్ ఉంది. మన పూర్వీకులు ఎంతో శ్రద్ధతో వాటిని రూపొందించారు. ఆ అద్భుతాల నుంచి మనం ఎలా బయట పడగలం? ఎన్ని జనరేషన్లు మారినా మనం వాటి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం. అలా ఉండాలి కూడా. నేను నా జ్యువెలరీ డిజైన్లకు దీన్నే అప్లై చేస్తుంటాను.

టర్నింగ్ పాయింట్
మియామీ ఫ్యాషన్ వీక్‌కు నేను ఎంపిక కావడం నా ఫస్ట్ ఎచీవ్‌మెంట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ షోకి ఇండియా నుంచి మొట్ట మొదటిసారిగా ఎన్నికైంది నేనే. ఇప్పటికీ ఎవరూ ఎంపిక కాలేదనుకోండి. అందులో పాల్గొన్నప్పుడే నాకు, నా జ్యువెలరీకీ బాగా పేరొచ్చింది. అది చూసే న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ వాళ్లు నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. లీడింగ్‌లో ఉన్న డిజైనర్లతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారు నా డిజైన్లను చూసి ‘జ్యు డిజైనింగ్‌లో ఇన్ని రకాల ఎమోషన్స్‌ని అప్లై చేయడం మేమిప్పటి వరకు చూడలేద’న్నారు. గుడ్ కాంప్లిమెంట్. ఆ గుడ్ టీమ్ ఎంకరేజ్‌మెంట్ నా బిగ్ డిజైన్స్‌కి ఉపయోగపడింది.

వే ఆఫ్ స్టైల్
నా డిజైన్లలో రకరకాల మెటీరియల్స్ పట్ల నాకున్న ప్రేమ కనిపిస్తుంది. నా మూడ్, నా చుట్టూ ఉన్న పరిసరాలు.. నన్ను ఇన్‌స్పైర్ చేసిన అంశాలు కూడా కనిపిస్తుంటాయి. పాతబస్తీలో చార్మినార్, హవేలీ పూర్వీకులు, వీధుల్లో డాన్స్ చేసే పిల్లలు, కుండలు చేసేవారు, పాత ఫోటోక్షిగాఫ్‌లు, పొడవైన కట్టడాలు, చరిత్ర పుస్తకాలు.. ఇవన్నీ నన్ను మెస్మరైజ్ చేస్తాయి.. అప్పుడు నేను కేవలం నా మనసునే అనుసరిస్తాను. నాకు అనిపించిందే చేస్తాను. అందుకే నా జ్యువెలరీ చాలా ప్రత్యేకంగా ఉంటుందని నేననుకుంటాను. నా డిజైన్‌లో ప్రతి పీస్ వెనక ఒక కథ ఉండాలని నేను కోరుకుంటాను.

రాయల్ రేంజ్
న్యూయార్క్ మ్యూజియంలో నా కలెక్షన్ ప్రదర్శనకు పెట్టినప్పుడు ప్రిన్స్ రిచర్డ్ ‘ఇంత చిన్న అమ్మాయి.. ఇంత పెద్ద అద్భుతాలు సృష్టిస్తోంది’ అన్నారు. ఆ మ్యూజియంలో నా ప్రతి డిజైన్ వెనుక కథని రాసి పెట్టి ప్రదర్శించారు. దాన్ని ఒక కళగా అభివర్ణించారు. అది చూసి మేం చాలా థ్రిల్ అయ్యాం. జోధ్‌పూర్‌లో బాల్ సమంద్ లేక్ ప్యాలెస్‌లో ప్రదర్శించిన నగల్ని ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, కమీలా పార్కర్ బౌల్స్, డచెస్ ఆఫ్ కార్న్‌వాల్, ప్రిన్స్ ఎడ్వార్డ్, మహారాజా గజ్ సింగ్ జీలాంటి వారు సందర్శించారు.

సమ్‌థింగ్ స్పెషల్
నా డిజైన్లు అన్ని రకాల వ్యక్తులకు బాగా నప్పుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమదైన స్టైల్ ఉంటుంది. కానీ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మరీ స్పెషల్. ఎందుకంటే ఆమె చాలా ఎక్స్‌పెరిమెంటల్. ఆమె ఏ ఆభరణం ధరించినా ఒక రాక్‌స్టార్‌లా కనిపిస్తారు.

suhan--wtసుహానీ సూపర్ 10
- జెమోలజీలో ‘సింగెమ్ అవార్డ్ ఫర్ ఎక్సపూన్సీ’ని సొంతం చేసుకుంది.
ఎల్లే మ్యాగజైన్ ‘30 రైజింగ్ స్టార్స్ ఆఫ్ ఇండియా’గా గుర్తించింది.
టాప్ త్రీ ఇండియన్ యాక్సెసరీ డిజైనర్లలో ఒకరుగా ‘వోగ్’ మ్యాగజైన్ గుర్తించింది.
- లండన్‌కి చెందిన ఎడ్జీ పబ్లికేషన్ ‘ట్యాంక్’ ఇండియాకు చెందిన బెస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ డిజైనర్‌గా అభివర్ణించింది.
- పాషనేట్ ఫౌండేషన్ ‘50 యూత్ ఐకాన్స్ ఆఫ్ ఆంధ్రవూపదేశ్’లో ఒకరుగా సుహానీని పొగిడింది.
‘అబూషన్ 2011’ పేరుతో జరిగిన వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ సుహానీని గెస్ట్ స్పీకర్‌గా ఆహ్వానించింది.
- బ్రిటీష్ కౌన్సిల్ 2009లో ‘యంగ్ ఫ్యాషన్ ఎంటర్‌వూపెన్యూర్’గా అవార్డు ప్రకటించింది.
2005 నుంచి విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్, ల్యాక్‌మే ఫ్యాషన్ వీక్‌లలో పాల్గొంటోంది.
- గ్రూన్జ్ బేగమ్, ఫ్రీ రిలీజియన్, అర్బన్ ఫోక్ పేర్లతో సుహానీ రూపొందించిన జ్యువెలరీ కలెక్షన్స్ ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేశాయి.
- సుహానీ జ్యువెలరీ హైదరాబాద్‌లోని సొంత స్టోర్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా 17 పెద్ద పెద్ద బొటిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine