బ్యూటిఫుల్ కలర్స్
ఫ్యాబ్రిక్ వేరయినా, కలర్‌లు మరేదైనా సరే.. మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్లే లేటెస్ట్ ట్రెండ్. హెవీ వర్క్‌లు లేకుండా ప్లేన్ శారీతో సింపుల్ బ్లౌజ్‌లతో రాయల్ లుక్ మీ సొంతం. మరి అలా డిఫంట్ కాంబినేషన్స్‌తో అదిరిపోవాలంటే.. ఈ చీరలపై ఓ లుక్కేయండి.
వంకాయ రంగు ప్యూర్ సిల్క్ చీర. దీనికి బ్లౌజ్‌గా రాణి పింక్ సిల్క్ ఫ్యాబ్రిక్‌ని ఉపయోగించాం. గోల్డెన్ బ్రాసో మెటీరియల్‌తో చేతులు కుట్టాం. నెక్‌కి, స్లీవ్స్‌కి రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చాం. చీర పల్లూని డిఫంట్‌గా డ్రేపింగ్ చేస్తే సూపర్ లుక్ మీదే. ఇక్కడ డ్రేపింగ్ అంటే.. కుచ్చులు, కుచ్చులుగా పల్లూని దగ్గరగా, డిఫంట్‌గా పెట్టడం. ఇప్పుడు ఇది సరికొత్త ట్రెండ్. హెయిర్ స్టైల్ కొంచెం మారిస్తే.. పార్టీల్లో డిఫంట్‌గా కనిపిస్తారు.
బూడిద రంగు క్రేప్ ప్లెయిన్ చీర. బ్లౌజ్ మెటీరియల్‌గా గోల్డ్ కలర్ క్రేప్ ఫ్యాబ్రిక్‌ని ఎంచుకున్నాం. దీని మీద చిన్న అద్దాలను నీలం రంగు దారంతో కుట్టాం. దాని చుట్టూ డల్ గోల్డ్ చమ్కీని ఇచ్చాం. నెక్‌కి, స్లీవ్స్‌కి నీలంరంగు మెటీరియల్‌తో పైపింగ్ చేశాం. చీర పల్లూ దగ్గర, పల్లూ చివరన డిఫంట్‌గా డ్రేపింగ్ చేశాం. ఇది పార్టీల్లో సింపుల్, సూపర్‌లుక్‌ని తెచ్చిపెడుతుంది. హెయిర్‌స్టైల్‌ని మారిస్తే మరింత బాగుంటుంది.
Other News