Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Zindagi >> Trend


మనసు కథ

An-Argum talangana patrika telangana culture telangana politics telangana cinema
‘వాడెప్పుడూ అంతే మాట్లాడితే చాలు...ఆర్గ్యుమెంట్‌కి దిగుతాడు’ అంటూ నరేష్‌వైపు చూపించాడు గణేష్.
నరేష్ అంతే ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదలడు. తనకు తెలియని విషయాన్ని కూడా భుజాన వేసుకుని పిచ్చి వాదనతో గెలిచి చూపిస్తాడు. అది అతనికి బాగా అబ్బిన కళ. స్నేహితుల గ్యాంగ్‌లో అతడే బెస్ట్ అని నరేష్ ఫీలింగ్ కానీ వాస్తవం ఏమిటంటే, నరేష్‌తో వాదించేంత ఓపిక ఎవరికీ లేక చివరికి అతడు చెప్పిందే ఒప్పుకుంటారంతా! మనోడేమో ఆ వాపును కాస్తా బలుపు అనుకుంటాడు.

చెరువులేని చోట బావులే గొప్ప అన్నట్టు తన ఏరియాలో తానే గ్రేట్‌గా ఫీలయ్యేవాడు నరేష్. కానీ ఒక టైమ్ ఉంటుంది కదా... మనుషుల, మనసుల కళ్లు తెరిపించడానికి. ఆ టైమ్‌ను తన జేబులో పెట్టుకుని తిరిగే సుభాష్ కలిశాడు నరేష్ బ్యాచ్‌లో. మనుషుల్లో రెండు రకాలుంటారు. ఒకరు వాదించేవాళ్లు. ఇంకొకరు చర్చించేవాళ్లు. ఈ రెండే నమ్ముతాడు సుభాష్. ఒకానొక శుక్రవారం ఇద్దరికీ పరిచయం అయ్యింది. సోమవారంకల్లా నరేష్ అంటే ఏమిటో సుభాష్‌కు పూర్తిగా అర్థమైంది.
సుభాష్ అంటే మాత్రం నరేష్‌కు అసూయ కలుగుతోంది. తను ఎంత వాదిస్తున్నా తన ఫ్రెండ్స్ అందరూ కూల్‌గా సుభాష్ చెప్పే విషయాలకే ఓటేస్తున్నారు.

ఇంకా కొన్నాళ్లు పోతే తాను ఏకాకిలా మారే ప్రమాదముందని గ్రహించాడు నరేష్. అందుకే ఏదో ఒకటి చేయాలనుకున్నాడు.
ఒకరోజు ఫ్రెండ్స్ అందరికీ పార్టీ అరేంజ్ చేశాడు. సుభాష్ సహా అందరూ హాజరయ్యారు.
తన టాలెంట్ అంతా ఉపయోగించి సుభాష్ కంటే తానే గొప్ప అని నిరూపించుకోవడానికే ఈ పార్టీ.
అక్కడా అల్లరి, హంగామా, ఎంజాయ్ అన్నీ సజావుగానే సాగాయి. వెటకారపు మాటలు ఎగతాళి చేష్టలు అన్నీ నడిచాయి. అయినా నరేష్ ప్రత్యేకమైన క్రెడిట్ దక్కించుకోలేకపోయాడు. పార్టీ అయిపోయింది. సుభాష్ బయలుదేరాడు. అతనితో పాటే ఒక్కొక్కరూ పార్టీ నుంచి నిష్క్రమించారు.
తెల్లవారి అందరూ కలిశారు. సుభాష్ తప్ప.

‘ఏరా! నాతో ఉన్నట్టే ఉంటున్నారు కానీ నన్ను అవాయిడ్ చేస్తున్నారు కదా మీరు. ఏముందిరా సుభాష్‌గాడి దగ్గర. వాడికి ఫుల్‌సపోర్ట్ చేస్తున్నారు’ అని తన ఫ్రెండ్స్‌ను సూటిగా అడిగాడు నరేష్.
‘వాదన కంటే చర్చ గొప్పదిరా. ఎందుకంటే వాదనలో ఎవరు కరెక్ట్ అనేది తెలుస్తుంది. చర్చలో ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది. నీ దగ్గర వాదన మాత్రమే ఉంది. వాడి దగ్గర విషయం ఉంది’ అంటూ క్లాస్‌కు బయల్దేరాడు గణేష్.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine