Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> Features >> Silsila


కొంప ముంచిన అబద్ధం

allarimain
ఒక అడవిలో నక్క ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపె నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క ఆనందపడిపోయేది. రాను రాను నక్కకు ఇదొక వ్యాపకంగా మారింది. ప్రతిరోజూ ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు. ఆ అడవిలో ఒక గుర్రం కూడా ఉండేది. అది అడవిలోని పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా, ఆరోగ్యంగా ఉండేది. ఎవరి జోలికి పోకుండా వినయంగా నడుచుకునేది. ఒకరోజు నక్క మేత మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది. గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

దాంతో నక్క ‘అడవిలో జంతువులన్నీ తనను చూస్తే గౌరవంగా, తను చెప్పే కబుర్ల కోసం ఆసక్తిగా ఉంటే ఈ గుర్రం తనను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, దీని సంగతి చూడాలి’అనుకున్నది. పైకి గుర్రంతో ‘నీకు ఒక ప్రమాదం ముంచుకు రాబోతున్నది. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే ఇక్కడి నుంచి పారిపో’ అంది. ఏమిటా ప్రమాదం’అని అడిగింది గుర్రం. ‘మన మృగరాజు సింహం నిన్ను చంపటానికి వస్తోంది. నేను అక్కడి నుంచే వస్తున్నాను’అంది నక్క. దాని గురించి పూర్తిగా తెలిసిన గుర్రం నక్కకు బుద్ధి చెప్పాలనుకుంది. ‘అంతేనా? నాకు సింహం అంటే భయం లేదులే. దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు’ అని చెప్పి, ‘నక్కా.. నక్కా.. నా సంగతి అలా ఉంచుగానీ మొదట నీ ప్రాణాలు రక్షించుకో’అన్నది గుర్రం. నా ప్రాణాలకేమైంది అని అడిగింది నక్క. మన రాజు సింహానికి ఉన్న ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట. వైద్యం కోసం ఎలుగుబంటి దగ్గరకు వెళ్తే ‘తోక చివర తెల్ల మచ్చ ఉన్న నక్క రక్తం తాగిస్తే జబ్బు నయం అవుతుంద’ని చెప్పిందట.


అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది. నువ్వు కనిపిస్తే చంపేస్తుంది. వెళ్లి దాక్కుని నీ ప్రాణాల్ని కాపాడుకో’అని చెప్పింది. దాంతో భయపడిపోయి నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్ల మధ్యలో దూరి ఎవరికీ కనపడకుండా నక్కుతూ, నక్కుతూ ఇంటికి వెళ్లింది. మూడు రోజుల తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది. నక్కకి కనీసం కుందేల్ని పట్టుకునే ఓపిక కూడా లేదు. తన విషయం అంతా చెప్పి ‘సింహం వస్తుందేమో చూసి చెప్ప’మని అడిగింది. ‘వామ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు. నేను వెళ్లను, నాకు భయం’అన్నది కుందేలు. మరొక రోజు నక్కను చూడటానికి కోతి వచ్చింది. అది కూడా అలాగే అన్నది. గతంలో అనవసరంగా వాటికి లేనిపోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది. వారం రోజుల తర్వాత గుర్రం వచ్చింది. ‘సింహం వస్తోందా’అని అడిగింది నక్క. ‘సింహం రాదు. కావాలనే నీకు అబద్ధం చెప్పాను. ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోనివి చెప్పి భయపెడుతున్నావు కదా! భయం అంటే నీకు తెలియాలనే అలా చెప్పాను’అంది గుర్రం. నక్క తప్పు తెలుసుకొని అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండసాగింది.

Other News
    Most Viewed galleries


    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine