టాయ్ స్టోరీ

ఈ సినిమా ఆలెడ్రీ రెండు పార్ట్స్‌గా వచ్చింది. వాటి సీక్వెలే ఇది. దీన్నొక అడ్వెంచరస్ మూవీగా చెప్పొచ్చు. ఒక బొమ్మ.. తనతో పాటున్న మిగతా బొమ్మలకోసం చేసే సాహసాలే ఈ సినిమా స్టోరీ. దీన్ని వాల్ట్ డిస్నీ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా నిడివి కేవలం 103నిమిషాలే. ఈ సినిమా తీయడానికి 200మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ఇక కథలోకి వెళ్దాం...
అండీ అనే పద్దేనిమిదేళ్ల కుర్రాడు ఉంటాడు. అతనికి బొమ్మలంటే ప్రాణం. అయితే కాలేజ్, హోంవర్క్స్ వల్ల బొమ్మలతో ఆడుకోవడానికి సమయం సరిపోదు. అందుకోసం వుడ్డీ అనే ఒక బొమ్మను తన కాలేజ్ బ్యాగులో వేసుకొని తన వెంట తీసుకుపోతుంటాడు. రాత్రి అయితే మాత్రం ఈ బొమ్మలకు ప్రాణం వచ్చేస్తుంది. ఎంచక్కా ఆడుకుంటాయి, పాడుకుంటాయి. అలా సాగిపోతున్న క్రమంలో ఒకరోజు వాళ్లమ్మ బొమ్మల్ని చిందరవందరగా ఉన్నాయి, గది సర్దుకొమని సలహా ఇస్తుంది. అండీ వుడ్డీని తప్ప మిగతా బొమ్మలనన్నింటినీ ఒక పాలిథీన్ కవర్‌లో కట్టి ఒక చోట పెట్టేస్తాడు. వాళ్లమ్మ చూడకుండా చెత్తగా భావించి ఆ బొమ్మల సంచిని బయట పడేస్తుంది. ఇక వాటికి స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తాయి ఆ బొమ్మలు. ఇన్ని రోజులు అండీ చేతులో నలిగిపోయినందుకు విముక్తి కలిగిందని సంతోషిస్తాయి. అక్కడి నుంచి వాటిని ఒక బేబీకేర్ సెంటర్‌కి తరలిస్తారు. అయితే ఆ బొమ్మలు అలా అనుకోవడాన్ని వెళ్లిపోవడాన్ని వుడ్డీ గమనిస్తుంటాడు. ఆ బేబీకేర్ సెంటర్‌లో నరకం అంటే ఎలా ఉంటుందో కనిపిస్తుంది ఆ బొమ్మలకి. కాళ్లు విరగగొ ఇష్టం వచ్చినట్లు నలిపేస్తుంటారు ఆ సెంటర్‌లో ఉన్న పిల్లలు.
పొద్దునంతా ఈ బాధలను భరిస్తుంటాయి. రాత్రి కాగానే వాటి కష్ట సుఖాలు చెప్పుకుంటాయి. అయితే అండీ బొమ్మలతో పాటు ఆ సెంటర్‌లో బార్బీ, కెన్, బిగ్ బేబీ, బేర్ బొమ్మలు ఉంటాయి. ఒక బార్బీకి తప్ప మిగతా అన్నింటికీ కష్టాలే ఆ సెంటర్‌లో. అక్కడ అండీ దగ్గర వుడ్డీ ఒక్కడే మిగిలిపోతాడు. మిగతా బొమ్మలను కలుసుకోవడానికి ఆ బేబీకేర్ సెంటర్‌కి ఓ రాత్రి పయనమైతాడు. ఎలాగో కష్టపడి ఆ సెంటర్‌లో అడుగుపెడతాడు. అక్కడ ఫ్రెండ్స్‌కి వచ్చిన కష్టాలు విని బాధపడతాడు. అప్పుడే బార్బీని చూసి ప్రేమలో కూడా పడతాడు. అయితే ముందు స్నేహితులను అక్కడి నుంచి తప్పించి ఎలాగైనా మళ్లీ అండీ దగ్గరకు చేర్చాలని నిర్ణయించుకుంటాడు. దానికోసం ఒక ప్లాన్ వేస్తాడు. అయితే ఆ ప్లాన్ ఫలించిందా? లేదా? ఆ బొమ్మలన్ని తిరిగి ఆండీని చేరుకున్నాయా? వుడ్డీ, బార్బీ ప్రేమ చివరకు ఏమైందనేది సినిమా తెలుసుకోవాలంటే చూడాల్సిందే!
Other News