గ్నోమియో అండ్ జూలియట్
గ్రేట్ రైటర్ షేక్‌స్పియర్ రాసిన ‘రోమియో అండ్ జూలియట్’ కథని ఆధారంగా తీసుకొని పూర్తి వినోదాత్మకంగా రూపొందించిన 3డీ యానిమేషన్ మూవీ ఇది. సినిమా ఆద్యంతం కూడా నవ్వుతూనే ఉంటారు. 84నిమిషాల నిడివి గల సినిమా. దీన్ని టచ్‌స్టోన్ పిక్చర్స్ వాళ్లు 36మిలియన్ డాలర్లతో ఖర్చు పెట్టి తీశారు.
మిస్టర్ మాంటిగ్యూ, మిస్టర్ క్యాపుపూట్ ఇద్దరు పక్క, పక్క ఇళ్లలో ఉంటారు. ఇద్దరికీ ఒక్క నిమిషం కూడా పడదు. వాళ్లకి ఓ పెద్ద గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్‌లో పోటీపడి చిన్న, చిన్న బొమ్మలను అలంకరిస్తారు. సడెన్‌గా వాటికి ఒకరోజు ప్రాణం వచ్చేస్తుంది. మాంటిగ్యూ ఇంట్లో ఉన్నవి బ్లూ కలర్ క్యాప్స్‌తో, క్యాపుపూట్ ఇంట్లో ఉన్న బొమ్మలు రెడ్ కలర్ క్యాపులతో ఉంటాయి. మాంటిగ్యూ, క్యాపుపూట్‌కి ఎలా పడదో, ఆ బొమ్మలు కూడా ఒక్క నిమిషం కలిసి ఉండవు. పైగా రోజుకో పోటీ అని పెట్టుకుంటారు. బ్లూ కెప్టెన్ గ్నోమియో. రెడ్‌కి రిప్రజెంటివ్‌గా టైబల్ట్ వ్యవహరించేవాడు. టైబల్ట్ ఎప్పుడూ మోసం చేసి గెలుస్తుండేవాడు. గ్నోమియో క్లోజ్ ఫ్రెండ్ అయిన బెన్నీ ఇదంతా గమనిస్తాడు. ఎలాగైనా వాళ్ల ఆటకట్టించాలని గ్నోమియోతో పథకం రూపొందిస్తాడు. ఒకరోజు రాత్రి ఇద్దరూ కలిసి క్యాపుపూట్ గార్డెన్‌లోకి ప్రవేశిస్తారు. వారి పథకం కాస్త తలకిందులవుతుంది. అక్కడ అనుకోని విధంగా రెడ్ క్యాప్స్ వాళ్లు వీళ్లని చూస్తారు. అప్పుడు తప్పించుకొని గ్నోమియో పరిగెత్తుతాడు.
అక్కడ రెడ్ క్యాప్స్ లీడర్ కూతురైన జూలియట్ తారసపడుతుంది. ఆమె గ్నోమియాను ఆ ప్రమాదం నుంచి రక్షిస్తుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వాళ్ల ప్రేమ విషయాన్ని జూలియట్ కప్ప ఫ్రెండ్ అయిన నానిటీకి చెబుతుంది. గ్నోమియో, జూలియట్ ఎవరికీ తెలియకుండా మరో గార్డెన్‌లో కలుస్తుంటారు. అక్కడ ఫెదర్‌స్టోన్ అనే ప్లాస్టిక్ ఫ్లెమింగో పరిచయం అవుతుంది. అది వీళ్ల ప్రేమను ఎంకరేజ్ చేస్తుంది. ఒకరోజు అనుకోకుండా రెడ్ క్యాప్ వాళ్ల మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు బ్లూ క్యాప్స్ వాళ్లు. దానికి గ్నోమియోను అడుగుతారు. అప్పుడు గ్నోమియో ఏం చేయాలో ఆలోచించుకుంటానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జూలియట్‌ని కలుస్తాడు. ఇద్దరికీ పెద్ద వాగ్వివాదం జరుగుతుది. నానిటీనే ఇద్దరు గొడవ పెద్దది కాకుండా అడ్డుపడుతుంది. వీరిద్దరు ఇలా కలవడాన్ని గ్నోమియో ఫ్రెండ్ బెన్నీ చూస్తాడు. ఎలాగైనా ఇద్దరు కలవకూడదని ఆలోచన చేస్తాడు. గ్నోమియో - జూలియట్ ప్రేమ విషయం టైబల్ట్‌కి కూడా తెలిసిపోతుంది. అతను కూడా ఇద్దరినీ విడగొట్టే పన్నాగాలు ఆలోచిస్తుంటాడు.
వారి పన్నాగాలు ఎంతవరకు సక్సెస్ అయ్యాయి. ఇకపోతే రోమియో జూలియట్ కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు కాబట్టి, ఆ స్టోరీ కథ విషాదాంతం. మరి ఈ కథ కూడా విషాదంతమో లేదో తెలుసుకోవాలంటే.. తెరమీద చూడాల్సిందే!
Other News