మినీ మేస్ట్రో!
పియానో ‘కీ’లకంటే ఆమె చేతులు చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఆ చిన్ని చేతులు పియానో మెట్ల మీద వివిధ రాగాలను పలకించగలుగుతాయి. ఆమె పేరే లావణియా రమీజ్. బ్రిటన్‌కి చెందిన ఈ పాప పియానో వాయించడంలో దిట్ట. రెండు సంవత్సరాల వయసు నుంచే పియానో వాయించడం మొదలు పెట్టింది. ఈ అమ్మాయి బ్రిటన్‌లో అతి పిన్న వయసు‘ పియానో ప్లేయర్’గా పేరు దక్కించుకుంది. స్టేజీ మీద 200మంది ఆడియన్స్ ముందు తన మొదటి అరంగేట్రం కూడా పూర్తి చేసుకుంది. అది కూడా రెండేళ్ల ప్రాయంలోనే. చిన్నప్పుడు టీవీలో కనిపించిన ఒక షో తనని ఆకర్షించిందట. తనకు పియానో కావాలని అల్లరి పెడితే.. ఆమె తల్లిదంవూడులు ఓ బొమ్మ పియానోని కొనిపెట్టారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ చూసి ఓ టీచర్ దగ్గరకి పంపించారు. ‘ఎంతో క్లిష్టమైన స్వరాలను కూడా అవలీలగా వాయిస్తుంది. ఒక్కసారి చూస్తే అంత తొందరగా మరిచిపోయే రకం కాదు లావణియా. అంతేకాదు, తనకి మూడ్ ఉంటే రోజంతా అలా వాయిస్తూ కూర్చోమన్నా కూర్చుంటుంది’అంటున్నారు లావణియా పియానో టీచర్. ఎంత శ్రద్ధ కదా! మరి రాబోయే కాలంలో మంచి ‘పియానో ఆర్టిస్టు’గా పేరు తెచ్చుకోవాలని మనమూ కోరుకుందాం!
Other News