పువ్వులు - తుమ్మెదలు

పువ్వును చూడగానే తుమ్మెదే కాదు.. ఏ కీటకమైనా వాలిపోతుంది. గాలి బాగా వీస్తే అక్కడి నుంచి ఏ కీటకమైనా ఎగిరిపోతుంది. కానీ తుమ్మెద అలా కాదు, పువ్వునే అతుక్కొని ఉంటుంది. ముఖ్యంగా పెటునియా, గులాబీ పువ్వులను మాత్రం తుమ్మెదలు అసలు విడిచిపెట్టవు. ఎందుకంటే.. ఆ పువ్వులోని రేకుల్లో ఉండే కణాలు తుమ్మెదలను పడిపోకుండా చేస్తాయి. ముఖ్యంగా కానికల్ కణాలు. తుమ్మెద పువ్వుల మీద వాలిపోగానే ఆ కణాలు దూరం జరిగిపోతాయి. ఆ కణాల మధ్యలో తుమ్మెద కాళ్లు ఇరుక్కుపోతాయి. ఇక గాలి ఎంత వీచినా కూడా తుమ్మెదలు పడిపోవన్నమాట. అయితే పెటునియా పువ్వులకు మాత్రం ఈ కణాలు ఉండవు. ఈ పువ్వుల మీద జిగురులాంటి పదార్థం ఉంటుంది. అది తుమ్మెద జారిపోకుండా పట్టి ఉంచుతుంది.
Other News