మెగా మైండ్
డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ పిక్చర్స్ వారు నిర్మించిన సినిమా మెగా మైండ్. ఇది త్రీడీ పిక్చర్. దీని నిడివి 90నిమిషాలు. ఇక బడ్జెట్ 130మిలియన్ డాలర్లు. ఈ సినిమా మొత్తం చాలా హ్యుమరస్‌గా సాగిపోతుంది. సినిమాలో హీరో ఉంటాడు, విలనూ ఉంటాడు. కానీ విలనే హీరోయిజాన్ని చూపితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. తప్పక ఈ సినిమా చూడాల్సిందే!మెగా మైండ్ సూపర్ ఇంటలిజెంట్ ఏలియన్. మాస్టర్ ఆఫ్ విలనీ అన్నా, జీనియస్ క్రిమినల్ అన్నా ఈ మెగా మైండే. ఇక సూపర్ హీరో పేరు మెట్రో మ్యాన్. ఇతను సిటీని సంరక్షిస్తుంటాడు. వీరిద్దరూ కూడా ఈ భూమి మీద జీవులు కాదు. ఇద్దరూ వాళ్ల తల్లితంవూడులు చనిపోవడంతో భూమి మీదకు వచ్చి పడతారు. ఓ అనాథ శరణాలయంలో పెరిగి పెద్దవుతారు. అందులో మెట్రోమ్యాన్ మంచిగా పెరుగుతాడు. కానీ మెగా మైండ్ మాత్రం అందరినీ ద్వేషిస్తుంటాడు. ఆ మెట్రో సిటీలో ఓ మ్యూజియం ఉంటుంది. అక్కడి వస్తువులు దొంగతనం చేయాలనుకుంటాడు మెగా మైండ్. దానికి తన ఫ్రెండ్ అయిన సిద్ధిక్ మీనియన్ సహాయం తీసుకుంటాడు. అప్పుడు రిపోర్టర్ రోక్సోని రిచీని కిడ్నాప్ చేస్తారు. ఇదంతా జరుగుతున్న మెట్రో మ్యాన్ ఏం చేయలేకపోతాడు. మెగా మైండ్ తన విజయాన్ని ప్రకటించేసుకుంటాడు. కానీ అప్పుడే ఓ ఆలోచన వస్తుంది మెగా మైండ్‌కి. ‘నేను చేసే పనిని ఎవరూ అడ్డుకోలేదు, నేను విజేతనేనా?’అని. దాంతో డిప్రెస్ అయిపోతాడు. కొంతకాలానికి రోక్సోని మెగా మైండ్‌కి దగ్గరవుతుంది.
ఆమె మెట్రోమ్యాన్ డీఎన్‌ఏతో ప్రయోగాలు చేసి వేరే మనిషిని సృష్టించొచ్చు అని చెబుతుంది. దానికి మెగా మైండ్ ఒప్పుకుంటాడు. రోక్సోని కెమెరా మెన్ సహాయంతో మెట్రో మ్యాన్‌ని అంతం చేస్తుంది. మరో జీవి ‘టైటాన్’కి ప్రాణం పోస్తుంది. కానీ ఆ టైటాన్ తన పవర్స్‌ని పిచ్చి, పిచ్చిగా ఉపయోగిస్తుంటాడు. ఇదంతా మెగా మైండ్‌కి తెలియదు. ఎందుకంటే.. మెగా మైండ్ రోక్సోని ప్రేమలో ఉంటాడు. కానీ కొంత కాలానికి టైటాన్ విషయం మెగా మైండ్ దృష్టికి వస్తుంది. ఎలాగైనా సిటీ నుంచి దూరంగా తీసుకెళ్లి టైటాన్‌ని చంపేయాలనుకుంటాడు. దానికోసం రోక్సోని సహాయాన్ని తీసుకుంటాడు. అయితే టైటాన్‌ని అంతం చేయాలంటే.. మెట్రో మ్యాన్ విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలు రోక్సోని మెగా మైండ్‌కి చెప్పిందా? టైటాన్‌ని మెగా మైండ్ చంపేశాడా? చివరికి రోక్సోని, మెగా మైండ్‌ల ప్రేమ చివరి అంకం చేరిందా? తెలుసుకోవాలంటే.. సినిమా చూడాలి.
Other News