బనానా ఆర్ట్
అరటిపండ్లు, జామపండ్లు, యాపిల్ పండ్లని చూస్తే ఏం చేయాలనిపిస్తుంది? తినాలనిపిస్తుందంటారేమో! కానీ ఫిల్ అనే అతనికి మాత్రం అరటిపండ్లని చూస్తే పండగే. ఎందుకంటే.. అతను వాటి మీద వివిధ చిత్రాలను గీస్తాడు. ఇతను నివాసం వాషింగ్టన్‌లో. చిన్నప్పటి నుంచి ఏ పనైనా కొత్తగా చేయాలనే ఆలోచన. అది కూడా అందరినీ ఆకర్షించేదిగా ఉండాలనే తపన. అందుకోసమే.. ఇతను అరటిపండ్ల మీద బొమ్మలు, డిజైన్ల టాటూలు వేస్తూ తన కెరీర్‌ని ప్రారంభించాడు. ఈ బొమ్మలను అతను ఓ చిన్న పిన్ను సహాయంతో వేస్తాడు. ఇప్పటివరకు ఆడమ్, ఫేమస్ డ్యాన్సర్స్ ఇలా ఆయన గీసిన ప్రతి బొమ్మకి ఒక కథ తప్పకుండా ఉంటుందట. రోజుకి కనీసం ఒక బొమ్మనైనా వేస్తాడు ఫిల్. అయితే ఇలా కేవలం అరటిపండ్లను మాత్రమే ఎంచుకోవడం వెనక ఒక కారణం ఉందట. ఏమిటంటే.. తనకు అరటిపండ్లంటే చిరాకు. దాంతో దాని మీదే ఆర్ట్ గీయాలని అనుకున్నాడు.
Other News