గాడ్ బ్లెస్ యూ
గాడ్ బ్లెస్ యూ మూలం మనకు ప్రాచీన ఏథెన్స్‌లో లభిస్తుంది. ఒకానొక సమయంలో ఏథెన్స్ ప్రజలు భయంకరమైన ప్లేగు వ్యాధితో బాధపడ్డారు. ఇప్పుడున్నట్లుగా అప్పుడు వైద్యరంగం అభివృద్ధి కాలేదు. దాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించసాగారు. మనుషులు చేయని పనిని దేవుడు చేసి కాపాడతాడని అక్కడి ప్రజలు నమ్మారు. ఆ వ్యాధిక్షిగస్థులకు దేవుడే దిక్కు అనుకున్నారు. ఎవరికైనా ఆ వ్యాధి లక్షణాలు కనిపించగానే వారి దగ్గరకు వెళ్లి జీవితం పట్ల కొత్త ఆశలు, భగవంతుడున్నాడనే భరోసా కలిగించే రీతిలో ‘గాడ్ బ్లెస్ యూ’అని పలకడం ప్రారంభించారు. ఇది ఒక విధమైన దీవెనగా మాత్రమే కాక భగవత్ ప్రార్థనలో ఒక భాగంగా మారింది. ఆ తర్వాత ఈ పదం బ్రిటన్‌కు చేరింది. అలా దేశ, విదేశాలు తిరుగుతూ ఈ పదం ప్రసిద్ధికెక్కింది. ‘మే గాడ్ బ్లెస్ యూ!’.
Other News