Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home >> Features >> Mee Features


అడవిబిడ్డల లొగిళ్లు

adabidddaమాది మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మున్ననూర్ గ్రామం. మా ఊళ్లో ఎక్కువగా మునులు నివసించేవారట. అందుకే ఊరికి ఆ పేరు వచ్చిందని మా పెద్దలు చెబుతుండేవాళ్లు. చుట్టూరా నల్లని ఎత్తైన కొండలు, దట్టమైన అడవితో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. విహారయావూతలకు కనువిందుగా ఉంటుంది. చెంచులు, గిరిపువూతులైన గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతం ఇది. వెదురు, వేపచెట్లు, నల్లమద్ది దట్టమైన అడవితో అల్లుకొని ఉంది. చీమలు దూరని అడవి, కాకులు కానరాని అడవి పూలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అడవి తేనేలు మా సొంతం. శ్రీశైలం-మద్దిమడుగు ప్రధాన రహదారి కావడంతో..హైదరాబాద్‌లో తయారైన రంగు, రంగుల కార్లు, బైకులు చూసి మా ఊరి జనం మురిసిపోతుంటాం. మా ఊళ్లో జనం అడవి ఉత్పత్తులను సేకరించుకొని బతుకు బండిని నడుపుతుంటాం. అడవిలో దొరికే పుట్టతేనె, పట్టుతేనె, నేరేడు, మారేడు పండ్లు, వెదురు బొంగులతో తయారు చేసే బుట్టలు, చాట్లు ఎన్నో దొరకుతాయి.

తల దువ్వుకొనే దువ్వెనలు, ఇరుపాన్లు తయారికి మా గ్రామం ప్రసిద్ధి. అంతేకాదు, బతుకుదెరువు చూపే అటవీ ఆకులు, మార్పటాకులతో తయారు చేసే ఇస్తారాకులకు ప్రతీతి. వీటిని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి మరి అమ్ముతారు. చిన్నా, పెద్ద సినిమాలు తీసుకునేందుకు అనుకూలమైన అడవులు మా సొంతం. నయాగరా జలపాతాలను మరిపించే ఉమామహేశ్వరం. లొద్ది మల్లయ్య క్షేత్రం, మల్లెల తీర్థం, అంతర్‌గంగలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అటవీ సంపదను పరిరక్షించేందుకు ఊరిలో ఓ చెక్‌పోస్టు ఉంది. తెలంగాణ ఉద్యమంలో మా ఊరు ఊరంతా 135రోజులు నిరహార దీక్షలో పాల్గొని సమర శంఖం పూరించింది. హైదరాబాద్ ప్రధాన రహదారిలో రోడ్డుకు అడ్డంగా గోడలను నిర్మించి నిరసన తెలిపాం. ప్రతి పల్లెలో తెలంగాణ నినాదాన్ని వినిపించే కార్యక్షికమాలను చేస్తున్నాం.
- చింతల జానయ్య, మున్ననూర్, మహబూబ్‌నగర్

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine