Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, June 20, 2013
 


Home >> Features >> Aadabidda


వర్షాకాలంలో చర్మ సౌందర్యం

beauty_skin2వర్షాకాలం... వర్షం వచ్చి వెలిశాక ఎంత తాజాగా ఉంటుందో... అంతకంటే ఎక్కువగా స్కిన్‌కు నష్టమూ కలిగిస్తుంది. కాబట్టి ఈ కాలంలో చర్మానికి స్పెషల్‌కేర్ అవసరం. సో... టోటల్ బాడీకేర్ కోసం నిపుణుల సూచనలు సలహాలు కొన్ని చూద్దాం..

వర్షాకాలంలో గాలి, నీటిలో ఎక్కువ క్రిములుంటాయి. అవి సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి తొలగిపోయి చర్మం కాంతివంతం కావాలంటే... మంచి టోనర్, క్లెన్సర్ తప్పనిసరి.
డ్రై స్కిన్ ఉన్నవాళ్లు రెగ్యులర్‌గా మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. బాదం, పాలు డ్రైస్కిన్ ఉన్నవాళ్లకు మేలు చేస్తాయి. ఎండలో తిరిగేవారికి పాలు, తేనె, నిమ్మరసం మంచి సన్‌వూస్కీన్ లోషన్స్‌గా ఉపయోగపడతాయి. చర్మంపై ఉన్న ట్యాన్ తొలగించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతాయి.

కాళ్లు చేతులు కడిగిన తరువాత రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు మాయిశ్చరైజర్ పూయాలి. రాత్రి పడుకునే ముందు కూడా కచ్చితంగా మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి. ఈ కాలంలో కాలివేళ్లు తొందరగా ఇన్‌ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బయటికి వెళ్లిరాగానే ఇంట్లో గోరు నీటితో యాంటీ సెప్టిక్ సబ్బు ఉపయోగించి పాదాలను శుభ్రం చేసుకోవాలి. గోళ్లలో మట్టి ఉండకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువగా గోళ్లు పెరిగితే మట్టి వెంటనే చేరిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు గోళ్లు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి.
ప్రతిసారీ పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే స్క్రబ్స్ తయారు చేసుకునే అవకాశం ఉంది. ఒక చెంచా ఓట్స్, ఒక చెంచా తేనె, ఒక చెంచా పాలు తీసుకోవాలి. వీటిని కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి, చేతులకు అప్లై చేయాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత గోరు నీటితో కడిగేయాలి.
- స్నానం చేసే నీళ్లలో కొంచెం పన్నీరు కలిపితే మంచి ఫలితం ఉండదు.
- తక్కువ కెమికల్స్ ఉన్న ఫేస్‌వాష్‌లను మాత్రమే వాడాలి.
- ఎండ ఉండదు కదా అని బయటికి వెళ్లేటప్పుడు సన్‌వూస్కీన్ లోషన్స్ వాడటం మానేస్తారు. కానీ కచ్చితంగా ముఖానికి, మెడకు, చేతులకు సన్‌వూస్కీన్‌లోషన్ అప్లై చేయాలి. దీనివల్ల ఎండబారినుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
- బయటినుంచి రాగానే జిడ్డు పోవడానికి బొప్పాయి గుజ్జుని ముఖానికి పట్టించి పదినిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి.
- స్వేద రంధ్రాలు మూసి ఉంచడానికి టోనర్ ఉపయోగించాలి. రోజ్‌వాటర్ అయితే ఇంకా మంచిది.
- రెగ్యులర్‌గా వాడే ఆయిలీ మాయిశ్చరైజర్‌లను పక్కనబెట్టి వాటర్ ఎసెన్స్ ఎక్కువగా ఉన్న మాయిశ్చరైజర్‌ను బాడీకి అప్లై చేయాలి.
- రోజంతా మీ చర్మం శుభ్రంగా ఉన్నప్పటికీ తప్పనిసరిగా రెండుసార్లు క్లెన్సర్‌తో క్లీన్ చేయడం మంచిది. నిద్రపోయే ముందు కచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
- 4 నుంచి 5 స్పూన్ల సున్నిపిండి. చిటికెడు పసుపు. ఐదారు చుక్కల రోజ్‌వాటర్. పాలు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి మర్దనా చేయాలి. కడిగేసిన తరువాత మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం వల్ల శరీరం తేమగా ఉంటుంది. అంతేకాదు స్క్రబ్‌తో మర్దనా చేయడం వల్ల రక్తవూపసరణ పెరిగి చర్మం కాంతులీనుతుంది.
- బొప్పాయి చర్మానికి చాలా మంచిది. ఇది మంచి ఫేస్ ప్యాక్‌గా పనిచేస్తుంది. రెండు బొప్పాయిగుజ్జుకు ఒక తేనె, గుడ్డులోని తెల్లసొన తీసుకుని కలుపుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఆగి కడిగేయాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.
- దోస, కీర లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది.
- కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపండి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునేటప్పుడు ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఉదయాన్నే లేవగానే శుభ్రం చేయాలి. దీనివల్ల ముఖం, మెడ మెరిసిపోయి అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది.
- వర్షాకాలంలో ఎక్కువగా వేడినీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. వర్షాకాలంలో వేడినీరు తాత్కాలిక స్వాంతననిస్తుంది. కానీ దీర్ఘకాలికంగా మంచిది కాదు. కాబట్టి గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడమే మంచిది.
- వర్షాకాలంలో తడిసి వచ్చినప్పుడు వెంటనే తలస్నానం చేయడం మంచిది.

బీపీకి చెక్ - 3
ప్రాణాయామం అంటే శ్వాసను అదుపులో ఉంచడం. శ్వాసపీల్చుకోవడం, రక్తవూపసరణ ఒకదానికొకటి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయితే శ్వాసక్షికియ రేటు కూడా వెంటనే మారిపోతుంది. అయితే ప్రాణాయామం రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసినట్లయితే శ్వాసక్షికియ రేటు తగ్గుతుంది. తద్వారా గుండె మీద ఒత్తిడి కూడా బాగా తగ్గుతుంది. దీనివలన మెదడు పనితీరు సక్రమం అవుతుంది.

వజ్రాసనం
రెండు కాళ్లను ముందుకు చాపి కూర్చోవాలి. ముందుకుడికాలిని మోకాలి వద్ద మడిచి నెమ్మదిగా వెనక్కి తీసుకురావాలి. తర్వాత ఎడమ కాలును మోకాలి వద్ద మడిచి వెనక్కి తీసుకురావాలి. రెండు కాలి బొటన వేళ్లు ఒకదానిమీద ఒకటి వచ్చేట్టు ఉంచి పాదాల మీద కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులు మోకాళ్ల మీద ఉంచాలి. ఇప్పుడు రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాస దీర్ఘంగా తీసుకోవాలి. ఇలా కూర్చోవడం కష్టం అవుతుంది. అప్పుడు చిన్న టవల్ మడతపెట్టి పాదాల కింద పెట్టి కొద్ది సమయం కూర్చోవాలి. నెమ్మదిగా రెండు మూడు నిమిషాలు కూర్చున్నాక మామూలు స్థితికి రావాలి. కొన్నిరోజుల ప్రాక్టీస్ తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు కూర్చోవచ్చు.

ఉపయోగాలు
- వజ్రాసనం వల్ల శరీరం ఊర్థ భాగానికి రక్త సరఫరా బాగా జరుగుతుంది.

శవాసనం
ముందు వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లను కొద్దిగా అటూ, ఇటూ కదిలించి భూమి మీద జారవిడవాలి. తలను రెండువైపుల కదిలించి నెమ్మదిగా మధ్యలో ఆపి ఉంచాలి. రెండు చేతులూ శరీరానికి కొద్దిగా పక్కకు జరిపి అరచేతులు ఆకాశం వైపు ఉండేట్టు చూడాలి. భుజాల దగ్గర ఎలాంటి స్టిఫ్‌నెస్ ఉండకుండా చూడాలి. భుజాలను తలకు దూరంగా జరపాలి. పాదాలను కిందివైపు తలను పై వైపు జరపాలి. ఈ స్థితిలో సాధారణశ్వాస తీసుకుంటూ 5 నిమిషాలు ఉండాలి. శవాసనం తర్వాత మోకాళ్లు మడిచి నెమ్మదిగా పక్కకు తిరిగి లేచి కూర్చోవాలి. ఆసనాలు వేసిన తర్వాత ఈ శవాసనం ప్రాక్టీస్ చేయొచ్చు.

ఉపయోగాలు
- మెదడుని శాంత పరుస్తుంది.
- డిప్రెషన్‌నుంచి కాపాడుతుంది.
- బీపీని బాగా తగ్గిస్తుంది.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine