హెల్దీ సూప్స్..
నిజమైన డాక్టర్ మందులకంటే ఎక్కువ.. మంచి ఆహారం గురించి చెప్తాడని చైనీయుల సామెత. నిజమే... ఈ వర్షాకాలంలో రుచితోపాటు ఆరోగ్యంగా ఉంచగలిగేవి సూప్స్. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒబెసిటీతో బాధపడేవారే కనిపిస్తున్నారు. యాపిల్ ఫర్ ఏ డే అన్నది పాత సామెత. కప్ ఆఫ్ సూప్ ఫర్ ఏ డే అన్నది కొత్త సామెత. రోజుకు ఓ కప్పు సూప్ తీసుకుంటే ఒబెసిటీ సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. అంతా ఒకే మోతాదులో తిన్నా... దాంతో పాటు సూప్ తీసుకున్నవారికంటే.. సూప్ తీసుకోనివారు ఎక్కువ వ్యాధిక్షిగస్తులవ్వడమే కాదు.. ఎక్కువ వెయిట్ కూడా పెరుగుతున్నారు. అయితే ఈ సూప్ కూడా బయట హోటల్స్‌లో కంటే ఇంట్లో తయారు చేసుకున్నదే ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.
తాజా కూరగాయలు, ఆరోగ్యకరమైన చిక్కుళ్లు, పప్పు ధాన్యాలతో చేసిన సూప్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి ధర తక్కువ ఉండటమే కాదు... అధిక ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కూడా వీటిలో ఉంటాయి. ఎక్కువ మోతాదులో అన్నం తినేకంటే కొద్దిగా అన్నంతోపాటు సూప్ కూడా తీసుకుంటే కడుపు నిండటమే కాదు... కొవ్వు కూడా తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇది అధిక బరువును సులభంగా తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే శరీరానికి అనేక మినరల్స్ కావాలి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సూప్స్ కీలకపాత్ర పోషిస్తాయి.
బాగా జలుబు చేసినప్పుడు చికెన్ సూప్ తాగి చూడండి. వెంటనే బ్యాక్టీరియా బయటికి పోతుంది. సూప్స్ తయారు చేయడం వల్ల కాయగూరల్లో ఉన్న సహజమైన గుణాలేవీ పోకుండా ఉంటాయి. ప్రత్యేకించి ఈ సూప్స్‌లో క్యాబేజ్, క్యారెట్స్, అల్లం, ఉల్లిగడ్డలు, పుట్టగొడుగులు, ఆకుకూరలు ఉపయోగిస్తే ఆరోగ్యానికి మరీ మంచిది. క్యాబేజ్ శరీరంలోని ఇన్‌ఫెక్షన్స్‌ను పోగొడితే.. అల్లం జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. ఇక బీట్‌రూట్, దోస, కీరదోస, పాలకూర రక్తాన్ని శుద్ధి చేసి అధికకొవ్వును కరిగిస్తాయి. కాలేయ శుద్ధికీ ఉపయోగపడతాయి. సూప్స్‌కి బియ్యపు పిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్ పొడిలాంటివి యాడ్ చేస్తే.. సూప్‌కి చిక్కదనం రావడమే కాదు అండ్ హెల్దీగానూ తయారవుతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా కావాలనుకునేవాళ్లు పప్పుధాన్యాలను యాడ్ చేసుకోవచ్చు. గుడ్డులోని తెల్లసొన కూడా కలపొచ్చు. వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలను చాలా జాగ్రత్తగా కడగాలి.
ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? సూప్‌ను మించిన ఫుడ్ మరోటి లేదు. అనారోగ్యంగా ఉన్న సమయంలో జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదు. అలాంటి సమయంలో సూప్ తీసుకుంటే సులభంగా జీర్ణమవ్వడమే కాదు.. వెంటేనే శక్తినిస్తుంది. ఒక్క కూరగాయలు, ఆకు కూరలే కాదు.. నాన్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు చికెన్, చేపలు, రొయ్యలతో కూడా సూప్ తయారు చేసుకోవచ్చు.
Other News