బీపీ అదుపుకోసం
పోటీ ప్రపంచంలో వృత్తి, వ్యాపారరీత్యా అనేక ఒత్తిళ్లు. ఆ ఒత్తిళ్ల వల్ల బీపీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నది. బీపీని అదుపులో ఉంచే ఆసనాలు ఈ వారం...
జాను శీర్షాసనం
జాను అనగా మోకాలు. ఈ ఆసనంలో తలను మోకాలు దగ్గరకు తీసుకొస్తాం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది.
పద్ధతి :
రెండుకాళ్లనూ ముందుకు చాచి వెన్నెముక నిటారుగా ఉంచి దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు కుడికాలిని మడిచి కుడిపాదం ఎడమకాలి తొడదగ్గర ఆన్చి ఉంచాలి. రెండు చేతులనూ పైకి చాచి గాలి పీల్చుకుని, శరీరాన్ని ఎడమవైపుగా తిప్పాలి. గాలి వదులుతూ రెండు చేతులనూ ముందుకు వంచి ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. రెండు చేతులూ పాదం చుట్టూ పెనవేయాలి. పొట్టలోపలికి లాగిపట్టి ఉంచాలి.
ఇలా 5 నుంచి 8 సెకెన్లపాటు ఉన్న తరువాత గాలి పీల్చుకుంటూ తల, శరీరం, చేతులు పైకి తీసుకురావాలి. ఇలా 5 సార్లు ఎడమకాలితో, 5 సార్లు కుడికాలితో చేయాలి.
ఉపయోగాలు :
-వెన్నెముక చుట్టుపక్కల రక్త ప్రసరణను పెంచుతుంది.
- బ్యాక్‌పెయిన్‌ను తగ్గిస్తుంది.
- లివర్, స్ప్లీన్ (చేదు)ల పనితీరును మెరుగుపరుస్తుంది.
- ఉదరాంగాలకు మంచి మసాజ్ చేస్తుంది.
- ఊపిరితిత్తులను శక్తివంతం చేస్తుంది.
- నాడీవ్యవస్థను బాగా ఉత్తేజితం చేస్తుంది.
పశ్చిమోత్తనాసనం :
దీనిని ఉగ్రాసనం అని కూడా అంటారు. ముందుగా వెల్లకిలా పడుకోవాలి. చేతులు తల వెనుకగా ఉంచాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ లేచి చేతులతో పాదాలను పట్టుకోవాలి. గాలి వదిలేస్తూ తలను మోకాలికి ఆన్చే ప్రయత్నం చేయాలి. ఈ స్థితిలో నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. కొన్ని సెకన్ల పాటు ఉన్న తరువాత గాలి పీల్చుకుంటూ యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు :
- పొట్ట చుట్టూ అధికంగా ఉన్న కొవ్వును తగ్గిస్తుంది.
- అజీర్ణం, మలబద్ధకం, డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది.
- వెన్నెముకలోని అన్నిభాగాలను ఉత్తేజితం చేస్తుంది.
జాగ్రత్తలు :-స్లిప్‌డిస్క్, బ్యాక్‌పెయిన్, సయాటికా ఉన్నవారు చేయకూడదు.
సంగీత అంకత
యోగా ట్రైనర్, బ్యూటీ ఎక్స్‌పర్ట్
సెల్ : 9705 665 266
Other News