నీళ్లే.. పంచవూపాణాలు!
నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకు కనీసం రెండు లీటర్లు తాగమని ప్రతీ డాక్టరూ చెబుతాడు. కానీ అదే పనిగా నీళ్లు తాగితే..? రోజుకూ ఆరు గ్యాలన్ల నీళ్లను గుటకాయ స్వాహా చేస్తే..? అంటే రోజుకు దాదాపు 25లీటర్ల నీళ్లు తాగితే? అమ్మో అంటారా! కానీ అలాగే చేస్తున్నదో అమ్మాయి. ఆమె పేరు సాశా కెనడీ. వయసు 26 సంవత్సరాలు. చిన్నప్పడు ఎవరో నీళ్లు తాగితే మంచిదని ఆమెకు చెప్పారట. అప్పటి నుంచి నీటికి అడిక్ట్ అయిపోయింది. స్కూలుకు వెళ్లేప్పుడు వాళ్లమ్మ ఒక బాటిల్ వాటర్ పెట్టి పంపించేది. అవి స్కూలుకు వెళ్లేలోపే అయిపోయేవి. బ్రేక్ టైమ్‌లో అందరూ ఆడుకుంటుంటే కెనడీ మాత్రం వాటర్ పూల్ దగ్గర కూర్చునేదట నీళ్లు తాగుతూ. ఆరేళ్ల ప్రాయంలోనే 12లీటర్లు తాగేదట. ఇది ఏమైనా ఆరోగ్య సమస్యనా? అని ఎందరో డాక్టర్లు చూపించారు ఆమె తల్లిదంవూడులు. కానీ జబ్బు పేరేమిటో ఏ డాక్టరు కనుక్కోలేకపోయారు. పైగా అమ్మాయి ఆరోగ్యం బాగానే ఉందని తల్లిదంవూడులు కూడా సర్దుకుపోయారు. రోజు పడుకునేటప్పుడు ఒక మగ్గు నీళ్లు పెట్టేవారట చిన్నప్పుడు. పొద్దున లేచేసరికి ఆ నీళ్లు కంప్లీట్ చేసేదట సాశా.
అయితే నీళ్లు తాగడం ఒక సమస్య అయితే బాత్రూమ్‌కి వెళ్లడం మరో సమస్యగా మారిపోయింది కెనడీకి. రోజుకు కనీసం 40సార్లు బాత్రూమ్‌కి వెళ్తుందట. నిద్రలో లేచి కూడా నీళ్లు తాగుతూనే ఉంటుందట. అందుకే తన నిద్ర సమయం రెండు గంటలు మాత్రమే. అప్పుడు మగ్గెడు నీళ్లైతే.. 20ఏళ్ల ప్రాయంలోకొచ్చిన తర్వాత ఐదు లీటర్ల క్యానును పక్కన పెడుతున్నారట ఆమె తల్లిదంవూడులు. ఈ అధికంగా నీళ్లు తాగడం మూలంగా తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంది. ముందు ఓ చెప్పుల కంపెనీలో పనిచేసేది. నీళ్లు తాగడం.. బాత్రూమ్‌కి వెళ్లడం మూలంగా పని చేయడం ఇబ్బందిగా మారి పని మానేసిందట. ఇప్పుడు ఓ టెలికాం కంపెనీలో ‘వర్క్ ఎట్ హోమ్’తో సరిపెట్టుకుంటుంది. కానీ ఈ ‘అతి అనర్థదాయకం’అంటున్నారు డాక్టర్లు. నీళ్లు ఎక్కువగా తాగడం మూలంగా ఒంట్లో ఉన్న ఆర్గాన్లు ఒక్కోసారి పనిచేయకుండా పోతాయి. దానివల్ల మరణం సంభవించవచ్చు అంటున్నారు. కానీ కెనడీ మాత్రం నీళ్లు తాగకుండా క్షణం కూడా ఉండలేనంటుంది. పాపం.. తన సమస్య ఎలా తీరుతుందో?
Other News