|
|
Home >> Features >> Aadabidda
నా తప్పుందా? - ఓ సోదరి మీ బావలు, అత్తయ్య, మామయ్యలు ప్రవర్తించిన తీరు కొంచెం మూర్ఖంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఎదుటి వాళ్లు బాగుపడితే మెచ్చుకోవాలి కానీ, అడ్డు పడటం మంచి లక్షణం కాదు. ఇల్లు కొనడం వల్ల లాభమే కానీ, నష్టం లేదు. అలాంటిదాన్ని వాళ్లు మీ పేరు కాదు, వాళ్ల అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేయమనడంలో అర్థం లేదు. అసలు ఈ వ్యవహారాన్ని ఇంత పెద్దగా చేయాల్సిన పని లేదు. ఇక పోతే.. మీరు బయట నుంచి వాళ్ల ఇంట్లో అడుగు పెట్టిన అమ్మాయి. కాబట్టి నీ మీద అంతగా నమ్మకం లేదేమో! కొంత కాలం తర్వాత వాళ్ల కొడుకును బాగా చూసుకుంటావో? లేదో అన్న సందేహం వాళ్లలో కలగవచ్చు. మీ అత్త, మామ, బావల మాటలు మీ ఆయన మీద బాగా పనిచేశాయనుకుంటా. అందుకే ఆయన కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఆయన స్వతహాగా ఆలోచించినా, వారి మాటల ప్రభావం కచ్చితంగా తన మీద ఉంది. కాబట్టి మీ ఆయననే కూర్చోబెట్టి సావధానంగా మాట్లాడండి. మీ ఆలోచనలేంటో చెప్పండి. మీరు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు చెప్పండి. ఇంకా ఎలాగూ ఫ్లాట్ తీసుకోలేదు. కాబట్టి మీ వారు మీ మాట వినే అవకాశం ఉంది. ఒకవేళ వినకపోయినా.. ఈ విషయమై పెద్దగా ఆలోచించకండి. ఉండడానికే కదా ఇల్లు కావల్సింది. అది చిన్నదైనా, పెద్దదైనా సర్దుకుపోవడమే. ఆయన పేరు మీద లోన్ తీసుకుంటారు, కాబట్టి ఇంటి ఖర్చులు, ఇతర భారాలు మీరే మోయోల్సి వస్తుంది. అప్పటి కోసం ఇప్పటి నుంచి ఎంతో కొంత జమచేయండి. ఇప్పుడు మీరిద్దరు. తర్వాత ముగ్గురు, నలుగురయ్యే అవకాశం ఉంది. వచ్చే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొదుపు చేయండి. నా వయసు 17 సంవత్సరాలు. నాకు అందమైన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కాకపోతే నాకంటే పది సంవత్సరాలు పెద్ద. అతను నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేస్తాడు. ఎందుకంటే.. మా మధ్య ఏజ్ గ్యాప్ వల్ల అతను అలా ప్రవర్తిస్తాడనిపిస్తోంది. ఇదంతా పెద్దగా ఏమీ అనిపించదు. కానీ ఈ మధ్య వాళ్ల కజిన్‌తో చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు. ప్రతీ విషయాన్ని ఆమెతో చర్చిస్తాడు. నేనడిగితే ‘నీకిలాంటివి అర్థం కావు, తనైతే మంచి సలహాలు ఇస్తుంది’ అంటాడు. నిజం చెప్పాలంటే.. దీనివల్ల ఏదో జెలసీ ఫీలింగ్ మొదలైంది నాలో. అసలు నేను ఆలోచిస్తున్నది కరెక్టో, తప్పో కూడా తెలియడం లేదు. ఓ మంచి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి నాకు తెలిసి మిమ్మల్నో ఆటవస్తువులా ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తోంది. జస్ట్.. టైపాసింగ్ కోసం మీ ముందు లవ్ ప్రపోజల్ పెట్టాడేమో! ఇంతకీ అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పాడా? లేదా? లేకపోతే మీరే తను మిమ్మల్ని ప్రేమిస్తున్నడనే భ్రమలో ఉన్నారా? ఒక్కసారి బాగా ఆలోచించండి. అతని ఆలోచనలో మీరేంటో క్లియర్‌గానే చెప్పాడు. మీరు తన ఆలోచనలు సరిగా అర్థం చేసుకోలేరని. అలాంటప్పుడు జీవితాంతం మీరు అతనితో ఎలా కలిసి ఉంటారు. నిజంగా వాళ్ల కజినే తనకు సరైన పార్టనరేమో! కాబట్టి ఏ విషయాన్నైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీరున్నది టీనేజ్‌లో. ఈ వయసులో ప్రతీదీ అందంగానే కనిపిస్తుంది. అందరూ మంచి వాళ్లగానే అనిపిస్తారు. కానీ టీనేజర్స్ మనం ఎంచుకునేది సరైనదా? కాదా అనేది మాత్రం ఆలోచించరు. మీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. మంచిగా చదువుకోండి. ఉన్నతస్థితిలో ఉండండి. అప్పుడు కచ్చితంగా మంచి లైఫ్ పార్టనర్ దొరుకుతాడు. అంతదాకా చదువు మీద శ్రద్ధ పెట్టండి.
Other News
|
|||||